అలిగిన కేశినేని నాని ..! బీజేపీ గాలానికి చిక్కారా..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు… కేశినేని నాని.. ఆ పార్టీకి దూరంగా జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ అధినేత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినప్పటికీ.. ఆయన హాజరు కాలేదు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమం.. దగ్గరుండి చూసుకోవాల్సిన కేశినేని నాని.. ఏ పని లేకపోయినా.. ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఉండిపోయారు.

చంద్రబాబు ఇఫ్తార్ విందుకు కేశినేని నాని దూరం..!

విజయవాడ ఎంపీగా అతి కష్టం మీద గెలిచిన కేశినేని నాని.. తనకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయినట్లుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల తరపున టీడీపీపీ అధ్యక్షునిగా గల్లా జయదేవ్‌కు చంద్రబాబు బాధ్యతలు ఇచ్చారు. లోక్‌సభా పక్ష నేతగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. పార్టీ తరపున గెలిచిన ముగ్గురిలో ఇద్దరికి పార్లమెంటరీ పదవులు ఇచ్చి.. తనకు మాత్రం.. ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. కేశినేని నాని అసంతృప్తికి గురయినట్లు చెబుతున్నారు. అప్పట్నుంచి ఆయన… టీడీపీకి దూరంగా ఉన్నారంటున్నారు.

ఢిల్లీలో బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారు..?

మరో వైపు.. కేశినేని నాని.. హుటాహుటిన…ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులకే.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లి… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. గెలిచినందుకు అభినందనలు తెలిపి.. తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిజానికి అప్పటికి గడ్కరీకి.. కేంద్ర మంత్రి పదవి వస్తుందో … లేదో క్లారిటీ లేదు. ఒక వేళ సీనియర్‌గా కచ్చితంగా వస్తుందని నిర్ణయించుకున్నా.. ఏ శాఖ ఇస్తారో … మోడీ, అమిత్ షాలు ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ.. కేశినేని నాని నాగపూర్ వెళ్లి … గడ్కరీని కలిసి.. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయడం టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తం అయింది.

పార్టీకి దూరమని చెప్పాలనుకుంటున్నారా..?

తెలుగుదేశం పార్టీ నేతల మీద బీజేపీ గురి పెట్టిందని… ప్రచారం జరుగుతున్న సమయంలో… కేశినేని నాని.. అలక కచ్చితంగా అనుమానించదగ్గదే. గెలిచిన రెండు, మూడు రోజులకే.. ఆయన బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులకు వెళ్లడం … కచ్చితంగా ఊహాగానాలకు తావిచ్చేదే. మరి ఈ విషయంలో కేశినేని నాని ఎలాంటి స్పందన వ్యక్తం చేసినా.. ఉద్దేశపూర్వకంగానే.. ఇలాంటి ఊహాగానాలు రావడానికి మాత్రం ఆయన వ్యవహారశైలే కారణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close