మహాత్ముడెక్కడా? మోదీ ఎక్కడ ??

మహాత్మునిగా ఎదగడం తప్పుకాదు. అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే ప్రోత్సహించాల్సిందే. కానీ అభినందించవలసిన సందర్భం మాత్రం ఇప్పుడేకాదు. పూర్తి విజయం సాధించినతర్వాతనే. ప్రధానమంత్రి మోదీని మహాత్మాగాంధీతో పోలుస్తూ తప్పట్లు కొట్టుకునేవారంతా ఈతేడాను గుర్తించాలి.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వేడుకలూ, విశిష్ట కార్యక్రమాలు దేశమంతటా జరిగాయి. వీటితోపాటుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన క్లీన్ ఇండియా కార్యక్రమమైన `స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కు ప్రధమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కొంతమంది పూజ్యబాపూజీతో పోల్చారు. పైకి చూసినప్పుడు ఇదేమీ తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుంటే ఎవరిస్థాయి ఎక్కడన్నది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.

డిజిటల్ ఇండియాతో లింక్

ఈమధ్యనే అమెరికా వెళ్ళివచ్చి డిజిటల్ ఇండియా కోసం పరితపిస్తున్న మోదీ దేశవిదేశాల్లో మంచి పేరుతెచ్చుకున్న మాట నిజమే. అయితే వచ్చీరాగానే ఆయనకళ్ల ముందు స్వచ్ఛ్ భారత్ ప్రధమవార్షికోత్సవం కనిపించింది. చురుకైనా ఆలోచనలు కలిగిన మోదీకి సరికొత్త ఆలోచన వచ్చింది. స్వచ్ఛ్ భారత్ ఆశించినంతగా ముందుకు సాగడంలేదన్న సంగతి ఆయనకు తెలుసు. 2019నాటికి అంటే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికి దేశంలో 80కోట్ల మరుగుదొడ్లు కట్టించాలన్నది సంకల్పం. ఇందులో మొదటి ఏడాదికి 20కోట్ల టాయిలెట్స్ నిర్మించాలి. అయితే, ఇందులో పూర్తికానివే ఎక్కువ. ఒక వేళ టాయిలెట్స్ ఏర్పాటుచేసినా నీటిసరఫరా వంటి ప్రాధమిక సౌకర్యాలు లేకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి. పూజ్యబాపూజీ కలలుగన్న స్వచ్ఛ్ భారత్ మొదటిఏడాదిలోనే వెనకడుగువేసింది. అయితే అంతమాత్రాన ఈ ఉద్యమ కార్యక్రమాన్ని తప్పుపట్టలేము. లక్ష్యం మంచిదైతే, మార్గం అదే దొరుకుతుందన్నది మోదీ ఆలోచనై ఉండవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ను ఉపయోగించుకుంటూ స్వచ్ఛ్ భారత్ ను విజయవంతం చేయాలనుకుంటున్నారని తెలిసింది. బహూశా, వచ్చే రేడియో ప్రొగ్రామ్- మన్ కీ బాత్ లో ఆయన తన మనసులోని మాట బయటపెట్టవచ్చు.

ప్రధానమంత్రిగా మోదీ ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన దేశాలను చుట్టబెట్టారు. ప్రాధమిక సౌకర్యాల రూపకల్పన ఆవశ్యకత ఆయన బాగానే గుర్తించారు. అయితే దాన్ని అమలుచేయడంలో ఎంత స్పీడ్ గా సాగుతార్నది పెద్ద ప్రశ్న. ఈ సందర్భంగా గాంధీజీ పారిశుధ్యం గురించి ఎంతగా తపించారో తెలుసుకుందాం…

నాటి గాంధీ…నేటి మోదీ

1917లో నీలిమందు తోటలు పండించే రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకోవడంకోసం గాంధీజి చంపారాన్ వెళ్ళారు. అప్పుడు ఆయన్ని తమ ఇంట్లో ఉండవలసిందిగా లాయర్ రాజేంద్రప్రసాద్ కోరారు. అవుట్ హౌస్ లో ఆయనకు బసఏర్పాటు చేశారు. అక్కడ తాను ఉపయోగించుకున్న బాత్ రూమ్, టాయిలెట్లను ఆయనే పరిశుభ్రం చేశారు. ఆ తర్వాత గుజరాత్ లోని వార్దాలో ఆశ్రమం ఏర్పాటుచేసినప్పుడు ప్రత్యేకమైన మరుగుదొడ్లు కట్టించారు.

గాంధీజీ పలుసందర్భాల్లో శానిటేషన్ ప్రాధాన్యతను చెప్పేవారు. రాజకీయ స్వాతంత్ర్యంకంటే పారిశుధ్యం తన దృష్టిలో ప్రాధాన్యమైనది అంటుండేవారు. క్రిందటి నెలలో మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్ర వాతావరణంతీసుకురావాలని అన్నారు. ఇదే మాటలను మోదీ కూడా చెబుతున్నారు. మాటలకూ చేతలకూ మధ్య ఉన్న తేడాను బాగాతగ్గించేలా చూడాల్సిన బాధ్యత మోదీపై ఉంది.

గాంధీజీ తాను నడిపిన యంగ్ ఇండియా పత్రికలో ఓసారి రాస్తూ, `మతాచారాలపేరిట గంగానది వంటి పుణ్యజలాలను కలుషితం చేస్తున్నాం. నదుల ఒడ్డున ఏమేమీ చేయకూడదో అవన్నీ చేస్తున్నాం, ఈ ధోరణి మార్చుకోవాలం’టూ రాశారు.

ఈ సందర్భంగా మోదీ ప్రధానమంత్రి కాగానే గంగానది శుభ్రతపై దృష్టిపెట్టడాన్ని గుర్తుచేసుకోవాలి. గంగానది ప్రక్షాళన ఎన్నోఎళ్లుగా నానుతున్న సమస్య. అయితే మోదీ స్పీడ్ పెంచి క్రిందటి మే నెలలో క్యాబినెట్ చేత గంగాప్రక్షాళనకు భారీ నిధులు మంజూరీకి ఆమోదముద్ర వేయించారు.

గాంధీజీ – నవజీవన్ అనే పత్రికను 1919 ప్రాంతంలో నడిపేవారు. ఆ పత్రికలో ఆయన మరుగుదొడ్ల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, అవి మన ఇంట్లోని డ్రాయింగ్ రూమ్స్ లాగా క్లీన్ గా ఉండాలని అన్నారు. ఈ విషయం తాను 35ఏళ్ల క్రిందటే విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు గుర్తించానని గుర్తుచేసుకున్నారు.

ఇక ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఈపాటికే మనదేశం ఎంతగా వెనుకబడిఉందో అర్థంచేసుకునేఉంటారు. గాంధీ మార్గాలను, ఆయన కళ్లజోడును (స్వచ్ఛ్ భారత్ లోగో) తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్న మోదీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తారన్న ఆశ ప్రజల్లో ఇంకా ఉంది. అందుకే కొందరైనా ఆయనలో మహాత్ముడిని చూసుకుంటున్నారేమో…

1937లో గాంధీ- వారపత్రిక `హరిజన్’ని నడుపుతున్నప్పుడు పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక వ్యక్తి ఆదర్శ గ్రామం అంటే ఏమిటని అడిగాడు. దీనికి గాంధీ బదులిస్తూ, అన్నివిధాలుగా పరిశుభ్రంగా ఉన్న గ్రామమే ఆదర్శగ్రామమని అన్నారు. అలా గాంధీ తన పత్రిక ద్వారా కూడా ప్రజల సందేహాలను తీరుస్తుండేవారు.

భారత ప్రధాని మోదీ ఆధునిక సమాచారవ్యవస్థ ద్వారా ప్రజల మనోభావాలను తెలుసుకని వారికి తనదైన శైలిలో సమాధానాలిస్తున్నారు. సోషల్ మీడియాతోపాటు ఆల్ ఇండియా రేడియోలో మన్ కీబాత్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. రాబోయే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఒక సూటి ప్రశ్నను ఎదుర్కోబోతున్నారు. ఆ విషయం ఆయనకూ తెలుసు. అదేమంటే, స్వచ్ఛ్ భారత్ ఏడాది అయినా ఆశించిన ఫలితం ఎందుకు రాలేదన్నది – ఈ ప్రశ్నకు మోదీ ఇప్పటికే సమాధానం ఎంచుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. డిజిటల్ ఇండియాతో స్వచ్ఛ్ భారత్ ని ముడిపెట్టు ముందుకుసాగించి సత్ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తామని మోదీ చెప్పవచ్చు. చెప్పినంత మాత్రాన చేతులు దులుపుకోవడం కుదరదు. మోదీ మహాత్మునిగా ఎదగాలని అనుకుంటే, కనీసం ఆయనగారి అభిమానులు అలా అనుకుంటుంటే, చెప్పిన మాటలను చేతల్లో చూపాల్సిందే.

శానిటేషన్ విషయంలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు అన్న తేడాలు రాకూడదు. దేశ ప్రజలు కోరుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏమంటే, శానిటేషన్ సమస్యకు పరిష్కారం. దీనితోపాటుగా రోడ్లు సరిగా ఉండేలా చూడటం, చెత్తాచెదారాలను, వ్యర్థాలను తొలగించాలని కూడా కోరుకుంటున్నారు. బాపూజీ విజన్ అని చెబుతున్న స్వచ్ఛ భారత్ ఆలోచనను ఏమాత్రం శంకించలేము. కాకపోతే మోదీ విజన్ ఎలా సాగుతుందన్నదే ఆలోచించాలి. 125కోట్లమంది ప్రజలు, విభిన్న సంస్కృతులు, విభిన్న రాజకీయ ఆలోచనలను సమన్వయపరచుకుంటూ ముందుకుసాగితేనేగానీ క్లీన్ ఇండియా సక్సెస్ కాదు. స్వచ్ఛ్ భారత్ ప్రారంభంలో నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక ప్రముఖులు…ఇలా అనేక రంగాలవాళ్లు చీపుర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చి ఫోటోలు తీయించుకున్నంతమాత్రాన క్లీన్ ఇండియా సాకారంకాదన్నది తొలిసంవత్సరపు హడావుడితో తేలిపోయింది. చూస్తుండగానే రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది స్వచ్ఛ్ భారత్. ఇప్పటికీ ఇదే తంతుగా ఉంటే మాత్రం మహాత్మా ఆశయాలను మోదీ ఎన్నటికీ నెరవేర్చలేరు. అప్పుడు, మోదీని మహాత్మునితో పోల్చేవారికి తీవ్ర నిరాశఎదురవుతుందనే చెప్పాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close