నందమూరి తారక రామారావు, కళ్యాణ్ రామ్‌ల బంధం ఇప్పుడు ఓ స్థాయిలో ఉంది. ఇద్దరూ కూడా రిలేషన్స్కి చాలా ప్రాముఖ్యతనిస్తారు. రాజమౌళి, సుకుమార్‌లాంటి టాప్ రేంజ్ సెలబ్రిటీస్‌తో పాటు, రాజీవ్ కనకాల లాంటి చిన్న స్థాయి నటీనటులతో ఉండే రిలేషన్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎన్టీఆర్. కళ్యాణ్‌రామ్‌ది కూడా అలాంటి వ్యక్తిత్వమే. నందమూరి వంశం అనే ట్యాగ్ ఉన్నప్పటికీ అందరితోకూడా అస్సలు గర్వం లేకుండా, వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు కళ్యాణ్ రామ్. చాలా సెంటిమెంటల్ పర్సన్ కూడా. బహుశా ఇలాంటి లక్షణాలే ఇద్దరినీ కూడా బాగా దగ్గర చేసి ఉంటాయి. ఇప్పుడు ఇజం సినిమా బిజినెస్ విషయంలో కూడా తెరవెనుక సపోర్ట్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఇంతకుముందు కళ్యాణ్ రామ్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఆదుకున్నాడు. అలాగే తాత పేరు మీద ఉన్న నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నిలబెట్టడం కోసం ఉచితంగా సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు ఎన్టీఆర్. ఇలాంటి విషయాల్లో ఈ ఇద్దరు అన్నదమ్ముల అనుబంధాన్ని అందరూ అభినందించాల్సిందే.
అయితే ఒక విషయంలో మాత్రం ఇద్దరూ కూడా అనవసరంగా అభిమానులను రెచ్చగొడుతున్నారు. వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అన్న కళ్యాణ్ రామ్ అయితే తమ్ముడు ఎన్టీఆర్పైన ఉన్న అభిమానంతో అవసరానికి మించి ఆవేశపడిపోతున్నాడు. బహిరంగ వేదికలపైన మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోతున్నాడు. జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్లో అది స్పష్టంగా కనిపించింది. ఇంతకు ముందు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు నడుస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్‌లో మాత్రం ప్రతి ఒక్క టికెట్, ప్రతి ప్రేక్షకుడు కూడా ముఖ్యమే. అందుకే అభిమానుల్లో ఆనందం నింపడం కోసమో లేక తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకో రెచ్చిపోయి మాట్లాడితే అది వాళ్ళకే నష్టం. నోరా…….వీపుకు చేటు తేకే అని తెలుగులో ఓ గొప్ప సామెత ఉంది. అందుకే రేపు జరగబోయే ‘ఇజం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అయినా నందమూరి బ్రదర్స్ ఇద్దరూ కూడా సింహాద్రి, షేర్లాంటి సినిమాల్లో ఉండే ఆవేశపూరిత హీరోయిజం కాకుండా, నాన్నకు ప్రేమతో సినిమాలో ఉండే సాఫ్ట్ హీరోయిజం చూపించాలని కోరుకుందాం. వినయంగా, సౌమ్యంగా మాట్లాడితేనే అందరికీ మంచిది కూడా.