గవర్నర్‌ .. స్పందిస్తారా? విని ఊరుకుంటారా?

భాగ్యనగరంలో రాజకీయ ముసుగులో ఉన్న అరాచక శక్తుల విపరీత పోకడలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ప్రథమపౌరుడి కోర్టులోకి చేరింది. గవర్నర్‌ నరసింహన్‌ ఈ విషయంలో ఎంత మాత్రం స్పందిస్తారు అనే విషయంలో.. నిన్న ఆయనను కలిసి నివేదించిన విపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. గవర్నర్‌ మాత్రం దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ప్రతిపక్షాల ఫిర్యాదు మీద గవర్నర్‌ స్పందించారు. అసలు జరిగిందేమిటో తన శైలిలో తెలుసుకోవడానికి ఆయన నగర కమిషనర్‌ను పురమాయించారు. పోలీసు కమిషనర్‌ ఆనంద్‌ , ఇవాళ గవర్నర్‌ను కలిసి పాతబస్తీ పరిణామాలపై తన నివేదికను ఇవ్వనున్నారు.

మజ్లిస్‌ దాడులపై కాంగ్రెస్‌, తెదేపా, భాజపా, వైకాపా, పార్టీలు బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రోద్బలం, అలుసుతోనే మజ్లిస్‌ పార్టీ ఇలా దుందుడుకు దాడులకు పాల్పడినదంటూ ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపుగా అన్ని పార్టీలూ విమర్శలు కురిపించడం విశేషం. సమావేశం ముగిసిన తర్వాత.. అఖిలపక్షానికి చెందిన నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మజ్లిస్‌ ఆగడాలను అరికట్టే ప్రయత్నం చేయాలని, అవసరమైతే సెక్షన్‌ 8ను కూడా అమల్లోకి తీసుకురావాలని నాయకులు గవర్నర్‌ను కోరారు. అయితే గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత ఆయన నిర్లిప్తంగా వ్యవహరించినట్లుగా కొందరు నేతలు అభిప్రాయం వెల్లడించడం విశేషం. వారు ఎలా పేర్కొన్నప్పటికీ.. గవర్నర్‌ మాత్రం చురుగ్గానే స్పందించారు. అసలు జరుగుతున్నదేమిటో తనకు తెలియజేయాలంటూ నగర కమిషనర్‌ను ఆదేశించారు.

అయితే గవర్నర్‌ మజ్లిస్‌ ఆగడాల గురించి కమిషనర్‌ ద్వారా తెలుసుకున్న తర్వాత.. ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా ఉంది. అఖిలపక్షం వారు విన్నవిస్తే- విన్నట్లుగా.. ఏదో కమిషనర్‌ను కూడా పిలిచి వివరాలు తెలుసుకుని అక్కడితే ఊరుకుండిపోతారా? లేదా, రాష్ట్ర ప్రథమపౌరుడిగా, గవర్నర్‌గా తనకున్న విస్తృతాధికారాలను, విచక్షణాధికారాలను ఉపయోగించి.. ఇలాంటి దుడుకు దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేలా ఏమైనా నిర్ణయాన్ని వెలువరిస్తారా? అనేది ఆసక్తికరమైన అంశం.

గతంలో ఇలా పలుమార్లు వివిధ అంశాల విషయంలో గవర్నర్‌కు విపక్షాలు చేసిన నివేదనలన్నీ వృథాగానే పోయాయి. ఇప్పుడు కూడా ఆయన పట్టించుకుంటారా? లేదా? అని అంతా అనుకున్నారు. అయితే.. ప్రస్తుత మజ్లిస్‌ దాడులను విపక్షాలు ఇక్కడితో విడిచిపెట్టడం లేదు. రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోంశాఖకు కూడా నివేదించబోతున్నాయి. ఎటూ రేపు అయినా సరే.. సమస్య మరింత సీరియస్‌ రూపం సంతరించుకోబోతున్నది గనుక.. గవర్నర్‌ ముందే తాను స్పందించినట్లుగా.. కమిషనర్‌ను పిలిపించినట్లు పలువురు భావిస్తున్నారు. మరి ఆయన ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాబోయే పవన్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండింగ్ ప్రాక్టీస్..!

ఈ రోజు డేట్ ఎంత.. జూలై 15. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ రెండింటి మధ్య నెలన్నర గ్యాప్ ఉంది. కనీసం.. తర్వాతి...

పార్టిసిపెంట్స్ కోసం వేట మొదలు పెట్టిన బిగ్ బాస్ 4.

ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ఒక సీజన్ ను నుంచి మరొక సీజన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు 4వ సీజన్...

“గంటా”పైకి సైకిల్ వదిలిన విజయసాయిరెడ్డి..!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ స్కాం అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్‌పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ముందస్తుగా.. విజయసాయిరెడ్డి ట్వీట్ హింట్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు...

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

HOT NEWS

[X] Close
[X] Close