కాపుల ఉద్యమ స్పూర్తితో తెలంగాణాలో కూడా ఉద్యమాలు మొదలు?

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కాపులను ఆకట్టుకొనేందుకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని, బారీగా నిధులు కేటాయిస్తామని తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనట్లుగానే, తెలంగాణాలో తెరాస పార్టీ కూడా ముస్లింలను ఆకట్టుకోవడానికి వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ తెదేపా ప్రభుత్వం లాగే అది కూడా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ప్రతిపక్ష పార్టీలు ఆ అంశంపై అధికార తెరాసను విమర్శించడంతోనే సరిపెట్టాయి తప్ప ఏపిలోలాగ దాని కోసం ఉద్యమించాలని ప్రయత్నించలేదు. కానీ ఏపిలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా ముద్రగడ పద్మనాభానికి అన్ని విధాల అండదండలుగా నిలుస్తూ కాపులు రిజర్వేషన్ల కోసం ఆయన మొదలు పెట్టిన ఉద్యమంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో, తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూడా అది ఆలోచింపజేసి, ఉద్యమానికి పురికొల్పుతునట్లుంది.

అందుకే తాము కూడా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కోరుతూ త్వరలో షాద్ నగర్ లో సభ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలంగాణా శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ నిన్న మీడియాకి తెలిపారు. షాద్ నగర్ లో సభ ఎందుకంటే అక్కడ జరిగిన సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.

అయితే ఆంధ్రాలో కాపుల ఉద్యమానికి ఆ వర్గం నుండి బారీగా మద్దతు లభిస్తున్నట్లుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం ఉద్యమిస్తే వారు తరలివస్తారా? అంటే అనుమానమే. ఎందుకంటే ఆంధ్రాలో కాపులకు అసలు రిజర్వేషన్లే లేనందున వారు ఉద్యమానికి కదలివచ్చారు. కానీ తెలంగాణాలో ముస్లింలకు ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లింలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ఉంటునప్పటికీ, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ పార్టీతో కాంగ్రెస్ కటీఫ్ చేసుకొన్నందున మజ్లీస్ పార్టీ అధికార తెరాసకు దగ్గరయింది. కనుక కాంగ్రెస్ పార్టీకిమజ్లీస్ సహకరించకపోవచ్చును. మజ్లీస్ సహకారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తన ఉద్యమం వైపు ఆకర్షించడం కొంచెం కష్టమే అవుతుంది. అయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించదానికి ప్రయత్నిస్తే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ముడుచుకొని కూర్చోరు కనుక ఆయన కూడా ముస్లింలు ఉద్యమంవైపు వెళ్ళకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తధ్యం. కనుక కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తే ముస్లింలు అందుకు మద్దతు ఇస్తారో లేదో అనుమానమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close