ముంబాయిలో నేడు చిరంజీవికి ఆపరేషన్

హైదరాబాద్: నటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవికి ఇవాళ ముంబాయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగనుంది. చాలాకాలంనుంచి బాధపెడుతున్న భుజం నొప్పికిగానూ ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు చిరు. ఆపరేషన్ తర్వత రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత కత్తి సినిమా రీమేక్ షూటింగ్‌లో చిరు పాల్గొననున్నారని సమాచారం.

చాలా రోజులనుంచి ఈ ఆపరేషన్ చేయించుకోవాలని చిరంజీవి అనుకుంటున్నారని, కత్తి సినిమా షూటింగ్‌‍ త్వరలో ప్రారంభం కానుండటంతో దానికి ముందే ఇది పూర్తి చేయ్యాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వియ్యంకులవారి అపోలో ఆసుపత్రిలాంటి అతి పెద్ద సంస్థ ఇక్కడే ఉండగా, ముంబాయి వెళ్ళి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేయించుకోవటం ఏమిటో తెలియటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాబోయే పవన్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండింగ్ ప్రాక్టీస్..!

ఈ రోజు డేట్ ఎంత.. జూలై 15. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ రెండింటి మధ్య నెలన్నర గ్యాప్ ఉంది. కనీసం.. తర్వాతి...

పార్టిసిపెంట్స్ కోసం వేట మొదలు పెట్టిన బిగ్ బాస్ 4.

ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ఒక సీజన్ ను నుంచి మరొక సీజన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు 4వ సీజన్...

“గంటా”పైకి సైకిల్ వదిలిన విజయసాయిరెడ్డి..!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ స్కాం అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్‌పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ముందస్తుగా.. విజయసాయిరెడ్డి ట్వీట్ హింట్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు...

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

HOT NEWS

[X] Close
[X] Close