“బట్టలిప్పి” మాట్లాడుకుందాం : పవన్ దగ్గర ఉన్న ఆధారం ఏంటి

ట్విట్టర్ వేదికగా, మీడియాతో, ప్రత్యేకించి టీవీ9 తో పవన్ కళ్యాణ్ యుద్ధం కొనసాగుతూ ఉంది. నిన్నటిదాకా ఏ ఆధారాలు లేకుండానే పవన్ కళ్యాణ్ హడావిడి చేస్తున్నాడు అనుకున్న వాళ్లు కూడా పవన్ తీరు చూసి కొంత, వస్తున్న సమాచారం చూసి కొంత , పవన్ దగ్గర ఏదో ప్రూఫ్ ఉన్నందువల్లే ఇంత దూకుడుగా వెళుతున్నాడనే అభిప్రాయానికి వస్తున్నారు. అయితే ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అన్న విషయంపైనఎటువంటి సమాచారం లభించడంలేదు. కానీ కొన్ని ఛానళ్లలో వస్తున్న వార్తలను బట్టి, పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఇస్తున్న పరోక్షమైన “క్లూస్” ని బట్టి ప్రజలు రకరకాలుగా ఊహిస్తూ ఉన్నారు.

నిన్నటి సాక్షి ఛానల్లో ప్రోగ్రాంలో – లోకేష్ స్నేహితుడు రాజేష్ కిలారు కి సంబంధించిన ఒక ఆడియో టేప్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని చెప్పారు. అయితే ఈ ఆడియో టేపు కాకుండా మరేదైనా ప్రూఫ్ కానీ టివి9 లేదా రవి ప్రకాష్ ఇమేజ్ ని దారుణంగా డ్యామేజ్ చేసే వీడియో కానీ ఏదైనా పవన్ దగ్గర ఉందా అన్న ఊహాగానాలు జోరుగా చేస్తున్నారు జనాలు, మీడియా వర్గాలు. అయితే ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్వీట్ లో కొన్ని క్లూస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ట్విట్టర్లో ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం క్లూస్ ఇస్తున్నాడో చూద్దాం

  • 1. “బట్టలిప్పి” మాట్లాడుకుందాం ప్రోగ్రాం నుంచి కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కళ్యాణ్. (ఇక్కడ ఏదైనా వీడియో గురించి క్లూ ఇస్తున్నాడా )
  • 2. రవి ప్రకాష్ ,నీకు ప్రత్యేకంగా టెక్స్ట్ చేస్తాను. కొంచెం వేచి ఉండు.
  • 3. శ్రీమతి రవి ప్రకాష్ గారు, మీ ఆయన చాలా మంచివాడమ్మా (ఇది వ్యంగ్యమా)
  • 4. రవి ప్రకాష్ , మీకు ” మీ వీడియో” పంపిస్తున్నాను దీన్ని మీ చానల్ లో ప్రసారం చేయండి. (మిగతా వాటిలా ట్విట్టర్ లో పెట్టకుండా, ఈ వీడియో ప్రత్యేకంగా తనకి మాత్రమే ఎందుకు పంపినట్టు)
  • 5. నిన్ను నిజమైన అజ్ఞాతవాసి అని ఎందుకు అంటున్నానో ఇప్పుడు అర్థమైందా వీడియో చూశాక ( అజ్ఞాతవాసి సినిమా కి ఈ వీడియోకి ఏంటి సంబందం)

ఇవి నిజంగా క్లూసా లేక క్యాజువల్ గా పవన్ వ్రాసిన విషయాలా అన్నవి తేలడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ కాస్త బుర్రకి పదునుపెడితే, వీటన్నిటిలో ఒక క్లూ గట్టిగానే దొరుకుతుంది. అయితే అధికారికంగా నిజంగా అలాంటిది ఏదైనా తేలితే మరొకసారి దీని గురించి చర్చిద్దాం..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com