అరెస్ట్ చేస్తే అంతేనా..? రేవతికి పోలీసులే శిక్ష అమలు చేస్తున్నారా..? 

మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని పోలీసులు అరెస్ట్ చేసి వారం రోజులు దాటిపోయింది. ఆమెను వారం రోజులు.. పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లోనే ఉంటారు. కానీ కేస్ డైరీని మాత్రం ఇంత వరకూ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. దీనిపై.. రేవతి భర్త, ప్రముఖ దర్శకుడు చైతన్య దంతులూరి ఫేస్‌బుక్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓ మహిళా జర్నలిస్టులు పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి వారం అవుతోందని.. ఇంత వరకూ..కోర్టులో కనీసం .., కేసు డైరీని ప్రొడ్యూస్ చేయలేదన్నారు. ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా.. పోలీసుల తీరును తప్పు పడుతూ.. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో విషయం.. జాతీయ స్థాయికి వెళ్లింది. 

రేవతిని లాకప్‌లో పెట్టడమే పోలీసుల లక్ష్యమా..?

నిజానికి రేవతి అరెస్ట్ వ్యవహారమే కలకలం రేపింది. ఆమెను కేసులో ఏ -2గా చేర్చారు. కానీ ఏ -1గా ఉన్న నిందితుడ్ని కనీసం పట్టించుకోలేదు. ఆయన కూడా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ..  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ.. ఏ-1 తమ టార్గెట్ కాదనుకున్నారేమో కానీ.. ఏ-2 రేవతిని మాత్రం.. అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఇప్పటికి కచ్చితంగా వారం రోజులు అయింది. ఎలాంటి కేసులో అయినా… వారం రోజుల్లో కేసు డైరీని.. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం.. పోలీసుల విధి. కానీ.. రేవతి విషయంలో మాత్రం.. పోలీసులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యం  వేరే అన్నట్లుగా ఉన్నారు. 


వారం రోజులైనా కేస్ డైరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయరా..?

అసలు రేవతిపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టదగిన ఫిర్యాదు కాదని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు. చానల్‌లో చర్చ కోసం వచ్చిన ఓ వ్యక్తి.. స్టూడియో నుంచి వెళ్లిపొమ్మన్నారన్న కోపంతో…. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ ఫిర్యాదు చేశారు. ఇది జరిగింది.. గత జనవరిలో. అప్పటి నుంచి పోలీసులు ఆ ఫిర్యాదున పక్కన పెట్టారు. ఎందుకంటే… రేవతి.. ఆ చర్చా కార్యక్రమం జరిగిన టీవీ చానల్‌కు సీఈవోగా ఉన్నారు కానీ.. ఆ చర్చలో కానీ.. ఇతర విషయాల్లో కానీ నేరుగా.. జోక్యం చే్సుకోలేదు.  చర్చకు యాంకర్‌గా వ్యవహరించిన రఘు అనే జర్నలిస్ట్‌ను ఏ -1 గా చేర్చి.. ఏ -2గా రేవతికిని చేర్చారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉండి.. మోజో టీవీని బలవంతంగా చేజిక్కించుకున్న తర్వాత ఆమెను బయటకు పంపేసిన తర్వాత… ఆ కేసును బయటకు తీశారు. అరెస్ట్ చేశారు. కానీ నిబంధనల ప్రకారం.. పోలీసులు వ్యవహరించడం లేదు.

తాము తల్చుకుంటే ఏమైనా చేయగలమని నిరూపించాలనుకుంటున్నారా..? 

ఎన్నోకొన్ని రోజులు జైల్లోనో… లాకప్‌లోనో ఉంచడమే లక్ష్యంగా పోలీసులు కక్ష సాధిస్తున్నారనే ఆరోపణలు.. మీడియా వర్గాల నుంచి వస్తున్నాయి. అసలు రేవతిపై పెట్టిన కేసుకు .. కనీస సాక్ష్యాధారాలు కూడాలేవని.. రేవతితో పాటు పని చేసిన మోజో టీవీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం .. ఆ చర్చా కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కించ పరిచిన దృశ్యాలు కూడా లేవంటున్నారు. అయినప్పటికీ.. ఓ ఫిర్యాదు ఆధారంగా రేవతిని అరెస్ట్ చేసిన పోలీసులు… వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే చాలు.. తమ లక్ష్యం నెరవేరుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత కేసు నిలబడినా.. నిలబడకపోయినా.. తాము విధించిన శిక్షతో ఆమెను  భయపెట్టగలిగేలా చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

జర్నలిస్టు సంఘాలకు నోరెత్తాలంటే భయమా..? 

తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా జర్నలిస్టులే వేధింపులకు గురవుతున్నా.. సాటి జర్నలిస్టులు కూడా… నోరు మెదపలేని స్థితి ఉంది. ఎక్కడ ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనని.. సమాజంలోని అన్ని వ్యవస్థలు భయడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే చట్ట విరుద్ధంగా ఓ మహిళా జర్నలిస్టును అరెస్ట్ చేసి… వారం రోజులు గడిచినా.. చట్టప్రకారం చేయాల్సిన ప్రక్రియ చేయకుండా… ఆమెను జైల్లో ఉంచితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నా…  ఆమెకు మద్దతుగా ఎవరూ నోరెత్తలేని పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close