ఆ లీడర్లకు టచ్ లో ప్రభాకర్ రావు..?అందుకే విచారణకు డుమ్మా..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు అవుతారని లీకులు ఇచ్చి… చివరి నిమిషంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆగిపోవడానికి కారణం ఎవరు.? ఆ నేతలే ప్రభాకర్ రావును విదేశాల నుంచి రావొద్దని ఒత్తిడి తెస్తున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ అధికారులను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. వారంతా ప్రభాకర్ రావు కనుసన్నలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. ప్రభాకర్ రావును ప్రశ్నించడం ద్వారా మరిన్ని అంశాలపై స్పష్టత వస్తుందని…అలాగే మాజీ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్లపై ప్రభాకర్ రావు ఎలా సమాధానం ఇస్తారో చూసి..ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని దర్యాప్తు టీం భావించింది. కానీ, ఈ కేసులో ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేయగానే, భుజంగ రావు, తిరుపతన్న, రాదాకిషన్ రావుకు కూడా నోటిసులు అందుతాయని… ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళారు. అనారోగ్యం పేరిట అమెరికా, దుబాయ్ అంటూ విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుని విచారణకు హాజరయ్యేలా చేయడం పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది.

ఇప్పటికే విచారణకు హాజరైన మాజీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. ప్రభాకర్ రావు సైతం ఈ కేసులో విచారణకు సహకరిస్తే చాలా విషయాలపై పోలీసులకు స్పష్టత వస్తుంది. ఇదే సమయంలో ఇప్పటికే కొంతమంది నేతల పేర్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు నోరు విప్పితే అనివార్యంగా లీడర్ల పేర్లను వెల్లడించాల్సి వస్తుందని…అది తమ మెడకు చుట్టుకుంటుందని ఆ నేతల టెన్షన్. ఈ కారణంగానే ప్రభాకర్ రావును విచారణకు హాజరు కావోద్దని పురమాయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నేతలతో ప్రభాకర్ రావు టచ్ లో ఉన్నారని…విచారణకు హాజరయితే అందరం ఇరుక్కుపోతామని ఆ నేతలు సూచించినట్టు చర్చ జరుగుతోంది. అందుకే ఆయన అనారోగ్యం పేరుతో విదేశాల్లో ఉన్నారనే టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ సమయంలో ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ పోలీసులకు అనివార్యంగా మారింది.దీంతో ఆయనను విదేశాల నుంచి ఇండియాకు రప్పించడం పోలీసులకు సవాల్ గా మారింది. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తీసుకురావడమా..? కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించడమా..? ఇలా పలు విధాలా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు విచారణకు దూరంగా ఉంటే ఇప్పటికే విచారణలో మాజీ అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా లీడర్లకు నోటిసులు ఇవ్వాలా..? అనే కోణంలో పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close