ఆర్జీవీ కి అత్యాశ అవసరమా?

Ram-Gopal-Varma
Ram-Gopal-Varma

కేవలం లుక్ లు, టీజర్లు వంటి వాటితో ప్రేక్షకులను ఆకట్టుకోవడం, హడావుడి చేయడం, ఆ తరువాత అంతకు మించి సినిమాలో విషయం లేకపోవడం అన్నది ఇప్పటికి ఒకటికి పది సార్లు రుజువయింది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత హఢావుడి చేస్తోందో, అప్పట్లో వంగవీటి అంతకన్నా హడావుడి చేసింది. ఆర్జీవీ విజయవాడ వెళ్లి హల్ చల్ చేసిన సంగతి గుర్తున్నదే. కానీ అంతా చేసి విడుదలయ్యాక, ఏనుగు సామెతలా మిగిలిపోయింది. ఆ నిర్మాత నష్టాల పాలయ్యారు. మళ్లీ ఇప్పటి వరకు సినిమా చేయలేదు.

ఇప్పడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కూడా డిజిటల్ మీడియాలో బాగా బజ్ వచ్చింది. డిజిటల్ మీడియా బజ్ అంతా టికెట్లుగా మారుతుంది అనుకుంటే భ్రమే. ఆ లెక్కకు వస్తే కథానాయకుడు సినిమాకు అంతకు మించిన బజ్ వచ్చింది డిజిటల్ మీడియాలో. అది చూసే మాంచి రేట్లు పెట్టి కొన్నారు. కానీ ఫలితం తెలిసిందే.

ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా ఇప్పుడు దాదాపు ఎనిమిదికోట్ల మొత్తానికి వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు కొన్నారు. పేరుకు వరల్డ్ వైడ్ కానీ, దీనికి తెలుగు రాష్ట్రాల్లో అదీ ఆంధ్రలోనే ఎక్కువ హడావుడి వుంటుంది. నైజాంలో తక్కువ. అలాంటి నేపథ్యంలో ఓ పొలిటికల్ సినిమాకు ఎనిమిది కోట్ల మొత్తం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. నిర్మాత ఎనిమిది కోట్ల రేంజ్ లో ఇచ్చేయాలని డిసైడ్ అయితే, వర్మ మాత్రం ఇప్పడు మరికాస్త ఎక్కువ కావాలని ఆశిస్తున్నట్లు బోగట్టా.ఇక్కడ సమస్య ఏమిటంటే, కొన్న డిస్ట్రిబ్యూటర్ జస్ట్ కోటి రూపాయలు ఇచ్చి ఓరల్ కమిట్ మెంట్ తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఆర్జీవీ మరి కొంచెం ఎక్కువ లాగే ప్రయత్నం చేస్తున్నారని టాక్. లేదూ అంటే ఓరల్ అగ్రిమెంట్ కాబట్టి, అడ్వాన్స్ వెనక్కు ఇచ్చి వెళ్లిపోమని చెప్పొచ్చు. అయితే కొన్న డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఇస్తే ఆ మొత్తానికి ఇవ్వండి లేదంటే, లేదు. అంతకన్నా ఎక్కువ ఇవ్వలేమని చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు  ఆర్జీవీ అర్జెంట్ గా ట్వీట్ వేసి, కొన్నవాళ్లను అయోమయంలో పడేసి, గురువారం మీటింగ్ కాల్ ఫర్ చేసారు. కానీ బయ్యర్లు ఇంక ఇంతకన్నా ఎక్కువకు వెళ్లేది లేదని మీటింగ్ కు ముందే తెగేసి చెబుతున్నారని తెలుస్తోంది. సినిమా పొరపాటున ఆంధ్రలో విడుదల కాకపోతే పరిస్థితి ఏమిటి?

ఆంధ్రలో వున్న తెలుగుదేశం ప్రభుత్వం సినిమాను బ్యాన్ చేయాలనుకుంటే చేయచ్చు. కావాలంటే కోర్టుకు వెళ్లండి అంటారు. అదంతా ముగిసేసరికి ఎన్నికలు అయిపోతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం వుంది. హైదరాబాద్ లో సినిమా విడుదలయినంత మాత్రాన వచ్చిన లాభం వుండదు. నష్టం వుండదు.

ఇదంతా ఎప్పుడు? నిజంగా సినిమా అంత ప్రభావితంగా వున్నపుడు? కానీ ఆర్జీవీ ట్రాక్ రికార్డు మాత్రం అలా వుంటుందని చెప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com