బోయపాటి – మైత్రీ – అడ్వాన్స్ కథ

boyapati-srinu
boyapati-srinu

టాలీవుడ్ నే కాదు, ఏ వ్యాపారం అయినా విజయం వెనుకే పరుగెడుతుంది. బోయపాటి శ్రీనివాస్ క్రేజీ డైరక్టర్ నే కావచ్చు. కానీ కమర్షియల్ గా నిర్మాతలు బాగుపడుతున్నది లేదు. ఆయన సినిమాల్లో (సరైనోడు) మినహా మిగిలినవి చాలా వరకు నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. అయితే ఎప్పడో అంతా బాగున్నరోజుల్లో కొటి లేదా కోటి పాతిక అడ్వాన్స్ ఇచ్చారు మైత్రీమూవీస్ నిర్మాతలు దర్శకుడు బోయపాటికి.

ఇప్పుడు పరిస్థితి బాగలేదు. బోయపాటితో సినిమా చేయడానికి అవకాశాలు కనుచూపు మేరలో కనిపంచడం లేదు. అందుకే అడ్వాన్స్ వెనక్కు ఇవ్వమని అడిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం కామన్ కాబట్టి, అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేసారు అంటూ వార్తలు కూడా వచ్చేసాయి.
అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం బోయపాటి ఇంకా అడ్వాన్స్ వెనక్కు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయమై డిస్కషన్లు నడుస్తున్నాయి. బోయపాటికి కొటికి కాస్త అటుగా అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి గాను ఇప్పుడు వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీలు లెక్క కట్టి, ఆరేడు కోట్లు వెనక్కు ఇవ్వమని మైత్రీ మూవీస్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.

అక్కడే సమస్య వస్తోంది. ఇచ్చిన అడ్వాన్స్ అలా వెనక్కు ఇచ్చేయడానికి అయితే బోయపాటి రెడీనే అంట. ఈ వడ్డీలు కలిపి ఇవ్వడానికి ఆయన అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ వివాదాన్ని సెటిల్ చేసే దిశగా డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. అంటే మరీ ఆరేడు కోట్లు కాకుండా, ఎంతో కొంత అదనంగా వేసి వెనక్కు ఇచ్చే దిశగా డిస్కషన్లు సాగుతున్నాయన్నమాట
ఇదిలా వుంటే కొన్నాళ్ల క్రిందట కూడా మైత్రీ మూవీస్ దర్శకుడు తివిక్రమ్ కు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కు తీసుకునే విషయం కూడా డిస్కషన్ కు వచ్చినపుడు ఇచ్చిన అడ్వాన్స్ కు నాలుగింతలు ఇవ్వమని మైత్రీ మూవీస్ జనాలు అడిగినట్లు వార్తలు వినవచ్చాయి. మరి మైత్రీ అడ్వాన్స్ లు ఇంకా చాలా మంది దగ్గర వున్నాయి. ప్రభాస్ దగ్గర, పవన్ కళ్యాణ్ తో సహా. మరి వాళ్లను ఏమేరకు అడుగుతారో అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com