ముంబైకి షిఫ్ట్ అవుతున్న‌స‌మంత‌?

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు.. స‌మంత. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడాకులు తీసుకోబోతోంద‌న్న వార్త‌పై ఇండ్ర‌స్ట్రీ మొత్తం హాట్ హాట్ గా చ‌ర్చిస్తోంది. ఈ విష‌యంలో నిజానిజాలేమిటో.. చై – స‌మంత‌లే చెప్పాలి. అయితే ఈలోగా స‌మంత ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే స‌మంత ముంబైకి షిఫ్ట్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో స‌మంత‌కు మంచి పేరొచ్చింది. దాంతో.. బాలీవుడ్ నుంచి అవ‌కాశాలు మొద‌ల‌య్యాయ‌యిని టాక్‌. నిజానికి స‌మంత‌కు బాలీవుడ్ వెళ్లాల‌న్న ఆస‌క్తి, ఆత్రుత ఏమాత్రం ఉండేవి కావు. కానీ బిజినెస్ మేన్ 2తో బాలీవుడ్ కిక్కేమిటో అర్థ‌మైంది. అందుకే కొన్నాళ్ల పాటు అక్క‌డ దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని, అక్క‌డ త‌న‌కంటూ ఓ పీఆర్‌నీ, మేనేజ‌ర్‌ని నియ‌మించుకుంద‌ని తెలుస్తోంది. కొన్నాళ్లు సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌నుకుంటున్నా – అని స‌మంత ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఆ బ్రేక్ అవ్వ‌గానే.. బాలీవుడ్ లో ఒక‌ట్రెండు సినిమాలు చేయాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌. స‌మంత ముంబైకి మ‌కాం మార్చ‌డం వెనుక‌… `చైతో విడాకులు` అనే విష‌యం ఏమైనా ఉందా? అంటూ ఇప్పుడు కొత్త కోణాల్ని అన్వేషిస్తోంది టాలీవుడ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close