సందీప్ రెడ్డివంగా కంటూ ఓ స్పెషాలిటీ ఉంది. ఓ విషయాన్ని తాను చూసే దృష్టి కోణం పూర్తిగా వేరు. ఏదైనా బోల్డ్ గా చెప్పేస్తుంటాడు. ఫ్యాంట్ లో ఐసు గడ్డలు కుక్కుకోవడం, హీరోని నగ్నంగా చూపించడం, ప్రయివేటు పార్ట్స్ షేవింగ్ చేసుకొన్నావా? అని అడగడం, అండర్ వేర్ గురించి హీరో – హీరోయిన్లు మాట్లాడుకోవడం.. ఇలా సందీప్ రెడ్డి చేసింది ఒకటా రెండా? రాతలో, తీత రెండూ వైల్డ్ గానే ఉంటాయి. అందుకే తన సినిమాలు సూటిగా గుచ్చుకొంటాయి. కొంతమంది నొసలు చిట్లించి, ఇవేం సినిమాలు అని అడుగుతుంటారు. కానీ యూత్ కి అవే నచ్చేస్తుంటాయి. ఇప్పుడు ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే వందకు వంద మార్కులూ కొట్టేశాడు. ఈ సినిమాలో కూడా బోల్డ్ నెస్ … బోర్డర్లు దాటేస్తుందన్నది ఇన్ సైడ్ వర్గాల మాట. హీరో క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందట. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోని చాలా ఎగ్రసివ్ గా చూపించాడు సందీప్ రెడ్డి. ఈసారి.. ఇంకొంచెం మోతాదు పెంచేశాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయా సన్నివేశాల్లో ప్రభాస్ ఎలా ఉంటాడా? అనే ఆసక్తి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో నెలకొంది. దాంతో పాటు కొన్ని సీన్లు.. సెన్సార్ షిప్ ని దాటుకొని వస్తాయా, రావా? అనే సందేహాలు ముందే మొదలైపోయాయి. అయితే.. సందీప్ టేకింగ్ చాలా టిపికల్ గా ఉంటుంది. బోల్డ్ నెస్ ని కూడా.. అందరూ అర్థం చేసుకొనేలా, కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేస్తాడు. అందుకే సెన్సార్ కత్తెర్లు దాటుకొని చాలా సీన్లు బయటకు వచ్చేశాయి.
కాకపోతే ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ వేరు. తన ఫ్యాన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్లని డిస్ట్రబ్ చేయకుండా.. చూసుకోవాల్సిన బాధ్యత సందీప్ రెడ్డిదే. ప్రభాస్ ఇమేజ్ ని వాడుకొంటూనే, తన బోల్డ్ నెస్ ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం. రాజాసాబ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్లందరి ఆశలూ.. ఇప్పుడు `స్పిరిట్`పైనే ఉన్నాయి. 2027 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.


