వైట్ల‌పై మ‌రీ అంత న‌మ్మ‌క‌మా??

‘ఆగ‌డు’ త‌ర‌వాత శ్రీ‌నువైట్ల కెరీర్ పూర్తిగా రివ‌ర్స్ అయిపోయింది. ఒక్క సినిమాతో డౌన్ ఫాల్‌కి ప‌డిపోయాడు శ్రీ‌నువైట్ల‌. ఆ వెంట‌నే ఫ్లాపుల మీద ఫ్లాపులు. బ్రూస్లీ, మిస్ట‌ర్‌.. ఒక‌దాన్ని మించి మ‌రో ఫ్లాప్‌. ఈ ద‌శ‌లో మైత్రీ మూవీస్ తో శ్రీ‌నువైట్ల సినిమా చేస్తాడ‌ని తెలిసి.. ఇండ్ర‌స్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. శ్రీ‌నువైట్ల పేరు వింటే… అటు నిర్మాత‌లు, ఇటు హీరోలు ప‌రుగులు పెడుతున్న ఫేజ్‌లో మైత్రీ ఆఫ‌ర్ ఇవ్వ‌డం నిజంగా గ్రేటే.

అయితే.. శ్రీ‌నువైట్ల మాట మాత్రం మ‌రోలా ఉంది. ‘మిస్ట‌ర్’ త‌ర‌వాత కూడా త‌న చేతిలో అయిదుగురు నిర్మాత‌లున్నార‌ని, తాను మాత్రం ‘మైత్రీ’ని ఎంచుకున్నాన‌ని అంటున్నాడు శ్రీ‌ను. ‘మిస్ట‌ర్‌’ లాంటి డిజాస్ట‌ర్లు చూసిన త‌ర‌వాత కూడా శ్రీ‌నుని నిర్మాత‌లు న‌మ్మారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. పైగా ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు. అయిదుగురు. అంతేనా..?? మైత్రీ ఆఫ‌ర్ ఇచ్చింది అని చెప్ప‌కుండా ‘మైత్రీని నేను సెలెక్ట్ చేసుకున్నా’ అన‌డం ఇంకాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. ఇదంతా శ్రీ‌నుపై నిర్మాత‌ల‌కు ఉన్న న‌మ్మ‌కమా? లేదంటే త‌న‌పై త‌న‌కున్న ఓవ‌ర్ కాన్ఫిడెన్సా..?? ఏదేమైనా మైత్రీ లాంటి నిర్మాత‌ల అండ దొర‌క‌డం నిజంగా శ్రీ‌ను అదృష్టం. లేదంటే… ‘మిస్ట‌ర్‌’ లాంటి ఫ్లాపు త‌ర‌వాత ఇంత లావీష్‌గా సినిమా తీసే ఛాన్స్ దొరికేది కాదు. ”నిజంగా ఈసినిమాని చాలా ల‌గ్జ‌రీగా తీశా. నాకు కావ‌ల్సింది నిర్మాత‌లు ఇచ్చారు. అలాగ‌ని నేనేం వేస్ట్ చేయ‌లేదు” అంటూ క‌వ‌ర్ చేసుకున్నాడు శ్రీ‌ను.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com