మ‌హేష్‌కి చెప్పిన క‌థ ఇదేనా? సుకుమార్ ఏమంటాడు?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న సినిమా ‘పుష్ప‌’. తొలి రోజే కాస్త డివైడ్ టాక్ వ‌చ్చినా, వ‌సూళ్ల జోరు మాత్రం త‌గ్గ‌లేదు. నైజాంలో ఆల్ టైమ్ రికార్డు సాధిస్తూ…11 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి ఈ క‌థ మ‌హేష్ కోసం త‌యారు చేశార‌ని, ఆ త‌ర‌వాతే.. బ‌న్నీ లైన్ లోకి వ‌చ్చాడ‌ని ఓ టాక్‌.

రంగ‌స్థ‌లం త‌ర‌వాత‌.. మ‌హేష్‌తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్‌. అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ స‌డ‌న్ గా ప్రాజెక్టు చేతులు మారింది. దాంతో.. మ‌హేష్ కి చెప్పిన క‌థ‌నే బ‌న్నీతో పుష్ప‌గా మ‌లిచాడ‌ని ఫిక్స‌యిపోయారంతా. ఈ రోజు ఈ విష‌యమై సుకుమార్ కాస్త న‌ర్మ‌గ‌ర్భంగా స్పందించాడు. “మ‌హేష్‌తో ఓ సినిమా చేయాల‌నుకుంది నిజ‌మే. ఆక‌థ‌కీ పుష్ప‌కీ చాలా తేడా ఉంది. ఈ క‌థ‌లు వేరు అని చెప్ప‌లేను. అలాగ‌ని ఒక‌టే అని కూడా అన‌లేను“ అని కాస్త వెరైటీగా స‌మాధానం ఇచ్చాడు. పుష్ప‌గా మ‌హేష్ బాబుని ఊహించ‌డం క‌ష్టం. క‌చ్చితంగా… మ‌హేష్ ఉండి ఉంటే, ఆ పాత్ర డిజైన్ అలా ఉండేది కాదు. కాక‌పోతే… మ‌హేష్ కి చెప్పింది కూడా ఎర్ర‌చంద‌నం నేప‌థ్యంలో సాగే క‌థే. మ‌హేష్ వెళ్లిపోయి, బ‌న్నీ వ‌చ్చిన త‌ర‌వాత‌… బ్యాక్ డ్రాప్ అదే ఉంచి… క్యారెక్ట‌రైజేష‌న్ కి మార్చుకున్నాడు సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

మండలి ఛైర్మన్‌పైనే నిఘా పెట్టిన అధికారి !

శాసనమండలి చైర్మన్ అంటే.. రాజ్యంగ పదవి. ఆయనపై ఎవరైనా నిఘా పెట్టలగరా ? కానీ ఏపీ అసెంబ్లీలో డిప్యూటేషన్ పై వచ్చిన ఓ అధికారి ఆయనపై నిఘా పెట్టేశారు. ఏకంగా ఆయన...

ఏపీలో ఉద్యోగుల మిలియన్ మార్చ్ !

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించనున్నారు. అయితే ఇది సాధారణ ప్రజలు చేస్తున్న మార్చ్ కాదు. సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు చేస్తున్న మార్చ్. అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close