హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్: నిజమేనా లేక త్వరలో పేలనున్న బుడగా ( పార్ట్-2) ?

Click here for part-1

ప్రీ లాంచ్- హైదరాబాద్ లో నయా ట్రెండ్:

గత నాలుగైదు సంవత్సరాలుగా హైదరాబాదులో ప్రీ లాంచ్ ఆఫర్ ల పేరిట కొత్త రకం ట్రెండ్ మొదలైంది. మై హోమ్ ,అపర్ణ ,ఆదిత్య వంటి రియల్ ఎస్టేట్ సంస్థల లాగా బలమైన ఆర్థిక వనరులు లేని మధ్య స్థాయి సంస్థలు ఎక్కడో ఒక చోట భారీ గా భూమి కొనుగోలు చేసి, ఆ తర్వాత ప్రీ లాంచ్ పేరిట ఆఫర్ విడుదల చేసి, లాంచ్ అయిన తర్వాత కోటి రూపాయలు పలికే ఫ్లాట్ ఇప్పుడు 60 లక్షల లోపే ఇస్తామని ప్రకటించి కొనుగోలుదారుల వద్ద నుండి డబ్బు సమకూర్చుకుని నిర్మాణం మొదలు పెడుతున్నాయి. పైగా నిర్మాణం పూర్తి అయిన తర్వాత- కావాలంటే అదే కోటి రూపాయలకు తామే ఫ్లాట్ కొనుగోలు చేస్తామని భరోసా ఇస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్స్ నాలుగైదు ఏళ్లు వెయిట్ చేయడానికి సిద్ధమై పోయి ఇటు వంటి ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు.

ఇటువంటి ఆఫర్లు మై హోమ్ వంటి పెద్ద సంస్థల అమ్మకాలకు గండి కొట్టడంతో, మై హోమ్ ఆధ్వర్యంలో నడిచే టీవీ9 లో ఇటువంటి ప్రీ లాంచ్ ఆఫర్ల పై ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా జరిగింది. స్టింగ్ ఆపరేషన్ ఫుటేజ్ తో పాటు ఇటువంటి ఆఫర్ ల లోని లొసుగులతో టీవీ9 లో కొన్ని రోజుల పాటు బ్యానర్ స్టోరీ లు ప్రసారం అయినప్పటికీ ప్రజల కి వీటిపై ఆసక్తి తగ్గలేదు.

రియల్ ఎస్టేట్ బూమ్ – కరప్షన్ లింక్:

రియల్ ఎస్టేట్ బూమ్ అసాధారణంగా ఉన్న ప్రతిసారీ, ప్రతి చోటా ఏదో ఒక రకమైన బ్లాక్ మనీ లింక్ దొరుకుతూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే, బ్లాక్ మనీ నిల్వలు కలిగిన వ్యాపారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు హైదరాబాద్ ఆకర్షణీయమైన గమ్యస్థానం గా కనిపిస్తోంది. పైగా ప్రీ లాంచ్ ఆఫర్స్ వంటి అంశాలు బ్లాక్ మనీ ని వైట్ చేసుకోవడానికి సులువైన మార్గంలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పూర్తి వైట్ మనీ తో సాలరీడ్ ఎంప్లాయిస్ కొనే ఫ్లాట్ల కంటే, భారీ మొత్తంలో బ్లాక్ మనీ క్యాష్ ని డౌన్ పేమెంట్ గా ఇచ్చి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫ్లాట్ల కొనుగోళ్ళు ఎక్కువ ఉన్నాయన్నది వాస్తవం.

బబుల్ పేలనుందా?

అనేక రంగాలలో ఇటువంటి బూమ్ తర్వాత రిసెషన్ రావడం అత్యంత సాధారణం. హైదరాబాద్ లో గత ఏడాది మూడు వేలకు పైగా ఫ్లాట్ లు కొనుగోలు కాకుండా మిగిలిపోతే, ఈ ఏడాది ఆ సంఖ్య 11 వేలకు చేరింది. ఇబ్బడి ముబ్బడి గా వస్తున్న వెంచర్ల కారణంగా భవిష్యత్తు లో ఈ సంఖ్య అసాధారణంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల ధరలు పూర్తిగా కొండెక్కి పోవడంతో నెలకు 50 వేల నుండి 75 వేల రూపాయల వరకు సంపాదించే వారు సైతం అపార్ట్మెంట్లు కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. మరొకవైపు బ్లాక్ మనీ తోనో, వైట్ మనీ తో నో కొన్న ఇన్వెస్టర్ ఫ్లాట్స్ సంఖ్య పెరిగిపోతోంది. దీంతో సప్లై పెరిగి డిమాండ్ తగ్గడం అనే పరిస్థితి అతి త్వరలోనే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది అంటూ ఆర్థికవేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు. ఏదేమైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కచ్చితంగా బుడగ మాత్రమే అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పేలక తప్పదు అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.

దీనికితోడు ముంబై చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇంకా చాలా వరకు ఖాళీ స్థలం ఉందని, స్థలం తక్కువగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడే నిజమైన డిమాండ్ వంటిది హైదరాబాద్ లో లేదని, హైదరాబాద్ లో చాలావరకు కృత్రిమ డిమాండ్ మాత్రమే ఉందని, బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి, ప్రీ లాంచ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడానికి కొనే ఇన్వెస్టర్ ఫ్లాట్స్ లో మాత్రమే కదలిక ఉందని, నిజంగా తామే ఉండడానికి ఇల్లు కొనుక్కునే రియల్ బయర్స్ 10 శాతం మాత్రమే ఉన్నారని వస్తున్న గణాంకాలు- ఇది బుడగ మాత్రమే అన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయి అన్న అభిప్రాయం విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది.

మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గతి ఏ విధంగా ఉండనుంది అన్నది భవిష్యత్తు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close