హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్: నిజమేనా లేక త్వరలో పేలనున్న బుడగా ( పార్ట్-1) ?

రెండు రోజుల కిందట ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దేశంలోని అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ , ముంబై తర్వాత రెండవ స్థానంలో అత్యధిక గ్రోత్ రేటు నమోదు చేస్తోందని, ఖరీదైన రెసిడెన్షియల్ రియాలిటీ మార్కెట్ గా హైదరాబాద్ దూసుకెళ్తోంది అని ఇచ్చిన నివేదిక తెలుగు రాష్ట్రాలలో సంచలనాన్ని కలిగించింది. అయితే అదే సమయంలో ఇది నిజమైన అభివృద్దేనా లేక ఒక బబుల్ లాగా ఎదుగుతూ వెళ్లి త్వరలో పేలిపోనుందా అన్న చర్చ ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..

ముంబై తర్వాతి స్థానంలో హైదరాబాద్:

రియల్ ఎస్టేట్ సంస్థ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ లో అత్యధిక అభివృద్ధిని నమోదు చేసిన నగరాల స్టాటిస్టిక్స్ ప్రచురించింది. దీని ప్రకారం ముంబైలో చదరపు అడుగు ఖరీదు 9600 నుండి 9,800 రూపాయల మధ్యలో ఉంటే హైదరాబాద్ లో ఈ ధరలు 5400 రూపాయల నుండి 5600 రూపాయలు మధ్యలో సగటున ఉన్నాయి. చెన్నైలో హైదరాబాద్ కంటే తక్కువగా 5,300 నుంచి 5500 మధ్యలో ఉండగా పూణేలో సుమారు ఐదు వేల రూపాయల ఖరీదు లో ఉన్నాయి. ఈ లెక్కన ముంబై తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉండడం గమనార్హం.

హైదరాబాద్ లో ఎందుకు ఇంత బూమ్:

రియల్ ఎస్టేట్ సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ లో ధరల పెరుగుదల, గ్రోత్ రేట్ అధికంగా ఉండడం తో పాటు హైదరాబాదు లో అమ్మకాలు కూడా బలంగా కొనసాగుతున్నాయి. అయితే ధర ల పెరుగుదల కు విశ్లేషకులు చెబుతున్న కారణాలు – భూమి ధర పెరగడం, ముడి సరుకుల ధర పెరగడం మరియు లేబర్ ధరలు పెరగడం కారణంగా నిర్మాణ వ్యయం పెరగడం. అయితే ఈ కారణాలు హైదరాబాద్ తో పాటు మిగతా నగరాలకు కూడా వర్తిస్తాయి. మరి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కు కారణమైన ప్రత్యేక అంశాలు ఏంటి అన్న చర్చ జరుగుతుంది.

ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ ల విషయంలో ఇన్వెస్టర్స్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారడం ఈ బూమ్ కి ప్రధాన కారణం అని తెలుస్తోంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో డబ్బు సంపాదించిన వారు సైతం తెలంగాణలోని ద్వితీయశ్రేణి పట్టణాలు నగరాలలో ఇన్వెస్ట్ చేయడం కంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపడం మొదటి కారణంగా తెలుస్తోంది. అయితే దీని కంటే బలమైన రెండవ కారణం ఆంధ్ర ప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చచ్చుబడి పోవడం. ఆ మధ్య రియల్ ఎస్టేట్ సంస్థలతో సమావేశం అయిన తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పరిశ్రమలు రాకపోవడం, రాజధాని విషయంలో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాని కి సంబంధించిన ఇన్వెస్టర్స్ కూడా హైదరాబాద్ వైపు దృష్టి సారించడం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కి మరొక ప్రధాన కారణం. వీటికి తోడు సాఫ్ట్ వేర్ రంగం లో హైదరాబాద్ నిలకడగా అభివృద్ధి సాధిస్తున్న కారణంగా హైదరాబాద్ లో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉండడం, నిషె టెక్నాలజీస్ లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడం, అలాగే హైదరాబాద్ లో బలంగా ఉన్న ఫార్మా రంగం లో అభివృద్ధి, జీతాల పెరుగుదల గణనీయంగా ఉండడం, వారు పెరిగిన జీతాల కారణంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గుచూపడం వంటివి కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరుగుదలకు కారణం అన్న విశ్లేషణ లు కొనసాగుతున్నాయి. వీటన్నింటికి తోడు గత నాలుగేళ్లలో హైదరాబాద్ లో మెట్రో రావడం, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ ల నిర్మాణం జరగడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెరగడం మరొక కారణం అన్న చర్చ జరుగుతోంది.

( To be continued)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close