ఈటలను పట్టించుకోని బండి సంజయ్ !

ఈటల రాజేందర్ కు బీజేపీలో నిరాదరణే ఎదురవుతోంది. ఆయన గెలిస్తే తమకు ఎక్కడ అడ్డు వస్తారో అని అనుకుంటున్నారేమో కానీ ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు. నామినేషన్ వేసినప్పుడు కనిపించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు మళ్లీ కనిపించలేదు. తర్వాత నవరాత్రి దీక్ష చేసిన బండి సంజయ్ ఇంటి నుంచి కదల్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మరో వైపు ఈటల కు పార్టీ పరంగా సహకారం లభించకపోవడంతో అన్నీ ఆయన ఒక్కడే చేసుకుంటున్నారు.

ప్రచారం కోసం హైకమాండ్ ముఖ్య నేతలు ఎవరైనా వస్తారో లేదో క్లారిటీ లేదు. తెలంగాణ పార్టీ తరపున ఇంచార్జులుగా ప్రకటించిన వారు పండుగ పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. మళ్లీ ఎప్పటికి వస్తారో స్పష్టత లేదు. ఉపఎన్నిక వస్తుందని తెలిసినా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. కానీ హుజురాబాద్‌పై పెట్టిన దృష్టి మాత్రం కొంతే. అక్కడ ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ప్రచార గడువు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ప్రచారం జోరు పెంచాల్సింది పోయి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడం ఈటల వర్గీయుల్ని నిరాశ పరుస్తోంది.

బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు జాతీయ నేతలు తరలి వచ్చారు. కానీ ఈటల విషయంలో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారన్న భావన పెరిగిపోతోంది. ఇవన్నీ పట్టించుకుంటే కష్టమని..తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు ఈటల.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close