‘రొమాంటిక్’ వెనుక ‘డార్లింగ్’ ప్ర‌భాస్!

స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్య‌క్తి… ప్ర‌భాస్‌. త‌న సింప్లిసిటీ గురించి అంద‌రికీ తెలిసిందే. త‌న వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. కొన్ని సినిమాల‌కు త‌న‌కు తానుగా ముందుకొచ్చి ప్ర‌మోష‌న్ చేసిస్తాడు. `రొమాంటిక్‌` సినిమా కోసం ప్ర‌భాస్ అదే చేస్తున్నాడు. పూరి త‌న‌యుడు ఆకాష్ పూరి – హీరోగా న‌టించిన చిత్ర‌మిది. ఈనెల 29న విడుద‌ల అవుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌భాస్ చేతుల మీదుగానే విడుదలైంది. నిజానికి.. ప్ర‌భాస్ తో ట్రైల‌ర్ రిలీజ్ చేయించాల‌న్న ఆలోచ‌న పూరిది కాదు. మొత్తంగా ప్ర‌భాస్‌దే. `ట్రైల‌ర్ నేను రిలీజ్ చేస్తా` అంటూ ప్ర‌భాసే ముందుకొచ్చాడు. `ఓ ఈవెంట్ ప్లాన్ చేసుకో.. నేను వ‌స్తా` అని పూరికి ప్ర‌భాస్ మాటిచ్చాడు కూడా. ఈవెంట్ చేసేంత టైమ్ లేక‌పోవ‌డంతో చిన్న గెట్ టు గెద‌ర్ లా ఏర్పాటు చేసి, ఆ ఫుటేజీ ఆ త‌ర‌వాత వ‌దిలారు.

పూరితో ప్ర‌భాస్ కి ఉన్న అనుబంధం తెలిసిందే. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో రెండు సినిమాలొచ్చాయి. `డార్లింగ్` అనే ప్ర‌భాస్ ఊత‌ప‌దాన్ని మాస్ కి చేర‌వేసింది.. పూరినే. ఏక్ నిరంజ‌న్ త‌ర‌వాత కూడా ఈ రిలేష‌న్ ఇంకా స్ట్రాంగ్ గా కొన‌సాగుతూనే ఉంది.  ప్ర‌భాస్ వ‌చ్చి, సినిమా గురించి మాట్లాడితే – క‌చ్చితంగా మంచి ప‌బ్లిసిటీ వ‌స్తుంది. పూరి వార‌సుడిగా ఆకాష్ ఎద‌గాలంటే ఓ హిట్టు అవ‌స‌రం. అందుకే.. ఈసినిమాకి తానంత‌ట తాను వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేశాడు ప్ర‌భాస్‌. దానికి తోడు… ఈ సినిమాలో `డార్లింగ్.. డార్లింగ్` అంటూ ప్ర‌భాస్‌ని గుర్తు చేసేశా ఓ పాట పెట్టారు. అందుకే ప్ర‌భాస్ కూడా `నా డార్లింగ్స్ అంతా ఈసినిమాని చూసేయండి` అంటూ అభిమానుల‌కు పిలుపు ఇచ్చాడు. ప్ర‌భాస్ ప‌బ్లిసిటీ ఈ ట్రైల‌ర్ తోనే ఆగ‌దు. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ మ‌రో రూపంలో.. ఈ సినిమాని ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి.. అదేంటో?  రొమాంటిక్ సినిమాకి అదెంత హెల్ప్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశాఖనే రాజధానట – రాజ్యాంగం పట్టించుకోని ఏకైక సీఎం జగన్ !

విశాక ఏకైక రాజధాని అని పెట్టుబడిదారులకు సీఎం జగన్ చెబుతున్నారు. విశాఖలో నిర్వహించబోతున్న గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు రావాలంటూ దౌత్యవేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఓ గెట్...

‘రైట‌ర్‌’ గారు చాలా చీప్‌

సుహాస్ హీరోగా న‌టించిన 'క‌ల‌ర్ ఫొటో'కి మంచి పేరొచ్చింది. అయితే అది థియేట‌ర్లో రాలేదు. ఓటీటీకి ప‌రిమిత‌మైంది. తొలిసారి సుహాస్ త‌న అదృష్టాన్ని థియేట‌ర్ల‌లో ప‌రీక్షించుకోబోతున్నాడు. 'రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌' సినిమాతో. ఈ సినిమా...

మ‌రో హీరోని విల‌న్ చేసిన బోయ‌పాటి

బోయ‌పాటి స్ట్రాట‌జీలు కాస్త భిన్నంగా ఉంటాయి. అప్ప‌టి వ‌ర‌కూ లేని ఇమేజ్‌ని త‌న సినిమాతో.. తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు బోయ‌పాటి. లెజెండ్ లో బాల‌కృష్ణ‌, అఖండ‌లో శ్రీ‌కాంత్‌ల ఇమేజ్‌ల‌ను పూర్తిగా మార్చేశారాయ‌న‌. ఇప్పుడు...

ఈటలకు పార్టీ మారక తప్పని పరిస్థితి వస్తుందా ?

బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు చిక్కులు వస్తున్నాయి. ఆయనపై సొంత బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీలో ఉండి ఆయన ఈ వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close