`వైల్డ్ డాగ్`… ప్లాన్ బి ఉందా?

నాగార్జున న‌టించిన సినిమా `వైల్డ్ డాగ్‌`. పూర్తి స్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింద‌ని, సంక్రాంతికి ఇంట్లోనే ఈ సినిమా చూసేయొచ్చ‌ని అంటున్నారు. దాదాపుగా ఎగ్రిమెంట్ల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేశాయి. అయితే నెట్ ఫ్లిక్స్ ద‌గ్గ‌ర ప్లాన్ బి కూడా ఉంద‌ట‌.

ముందు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి, మూడు రోజుల త‌ర‌వాత‌.. నెట్ ఫ్లిక్స్‌లోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. సంక్రాంతి మంచి సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో వ‌సూళ్లు బాగుంటాయి. అందుకే క‌నీసం మ‌ల్టీప్లెక్స్ లో అయినా ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఆ బాధ్య‌త కూడా నెట్ ఫ్లిక్సే చూసుకోబోతోంద‌ట‌. థియేటరిక‌ల్ రిలీజ్ చేసే హ‌క్కు ఇప్పుడు నిర్మాత‌ల చేతుల్లో లేదు. అది ఓటీటీకి వెళ్లిపోయిన‌ట్టే. కావాలంటే థియేట‌ర్లోనూ విడుద‌ల చేసుకుంటారు. లేదంటే ఓటీటీతో స‌రిపెడ‌తారు. సినిమాపై న‌మ్మ‌కం ఉండి, థియేట‌ర్ల వ‌ర‌కూ జ‌నాలు వ‌స్తారు, చూస్తారు అనుకుంటే.. అటు ఓటీటీలోనూ, ఇటు వెండి తెర‌పైనా ఒకేసారి ఈ సినిమా చూడొచ్చు. సంక్రాంతికి థియేట‌ర్ల వ్య‌వ‌స్థ ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలోకి రాక‌పోతే.. నేరుగా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖమ్మంలో టీడీపీని పోటీ చేయమంటున్న బీజేపీ !

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో.. నామా నాగేశ్వరరావు నిలబడినా...
video

‘కంగువా’ గ్లింప్స్: ఓ స‌రికొత్త ప్ర‌పంచం

https://www.youtube.com/watch?v=ByCDEmNig7Q విజువ‌ల్ ఎఫెక్ట్స్ విలువెంతో, దాంతో ఏమేం చేయొచ్చో తెలిశాక‌.. వెండి తెర‌పై స‌రికొత్త ప్రపంచాల్ని సృష్టించ‌డానికి ద‌ర్శ‌కులు పోటీ ప‌డడం మొద‌లెట్టారు. ఆ కోవ‌లో శివ కూడా చేరిపోయాడు. యాక్ష‌న్ సినిమాల‌తో కెరీర్...
video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close