అభివృద్ధిలో అస్సాం ఫస్ట్.. ఏపీ సెకండ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే సర్వేలో మరోసారి వెల్లడయింది. వివిధ అంశాల ప్రాతిపదికగా సమాచారాన్ని సేకరించి.. ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ పేరతో గణాంకాలను ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా ప్రకటించింది. పెద్దరాష్ట్రాల్ల్లో మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా అస్సాం మొదటి స్థానంలో నిలించింది. ఏపీ కూడా గత ఏడాది రెండో స్థానంలో నిలిచింది. కానీ టీడీపీ హయాంలో 2018లో మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంటే వైసీపీ సర్కార్ వచ్చిన ఏడాదికే ఏపీ రెండో స్థానానికి చేరింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.

కరోనా కట్టడి విషయంలోనూ అస్సాం .. అద్దిరిపోయే ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ తక్కువ కాదు. మూడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కట్టడి దేశం మొత్తం తమ వైపు చూస్తుందని వైసీపీనేతలన్నారు కానీ.. అస్సాం వైపు చూసినట్లుగా తెలుస్తోంది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి వచ్చింది.

మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌తో కలిసి ఇండియా టుడే సంస్థ ఈ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది. మొత్తం పన్నెండు కీలక రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించి.. ర్యాంకులు ఇస్తుంది. 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్‌ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ చూస్తూ ర్యాంకులు ఇస్తుంది. ఇందులో ఏపీ దూసుకెళ్తోందని గత ఏడాది నుంచి చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

ఈవారం బాక్సాఫీస్‌: మూడింటితో స‌రి

మార్చిలో బాక్సాఫీస్ జాత‌కం ఏం మార‌లేదు. సంక్రాంతి త‌ర‌వాత స‌రైన స‌క్సెస్ లేని తెలుగు సినిమాకు గ‌త లో కూడా మొండి చేయే ఎదురైంది. ఏకంగా ఏడెనిమిది సినిమాలు వ‌రుస క‌ట్టినా, ఒక్క...

గవర్నర్ తమిళిశై రాజీనామా – చెన్నై నుంచి ఎంపీగా పోటీ !

తెలంగాణ గవర్నర్ తమిళిసై సొందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా దృవీకరించలేదు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close