బాబు స్కీమ్ .. జగనన్న స్కీమ్..! ఏదీ కావాలి..!?

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు పబ్లిసిటీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకూడదనుకుంటున్న ప్రభుత్వం దానిపై లక్షల్లో రుణం ఉంటుందని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందు కోసం కోట్లు ఖర్చు పెట్టి .. చంద్రబాబు స్కీమ్, జగనన్న స్కీమ్ అంటూ ప్రచారం ప్రారంభించింది. ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేస్తోంది. ఇదంతా.. టిడ్కో ఇళ్ల లబ్దిదారులను గందరగోళ పరిచి.. వారు తమకు ఇళ్లు వద్దు అని చెప్పించడానికన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అవి చంద్రబాబు ఇళ్లు కాదు.. ప్రభుత్వ ఇళ్లు..!

జగన్ అయినా.. చంద్రబాబు అయినా సొంత డబ్బులతో ఇళ్లు కట్టించలేదు. వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు. ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముతోనే ఇళ్లను కట్టిస్తున్నారు. దాని ప్రకారం.. వారు పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు. చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్లు కట్టించారు. నిరుపేదలకు కేటాయించాలని అనుకున్నారు. దాని కోసం లక్షల మంది తమ వంతు సొమ్ము కట్టారు. ఇళ్లు సిద్ధమయ్యాయి. ఇళ్లు కట్టడానికి చంద్రబాబు తన సొమ్ము ఖర్చు చేయలేదు. కాబట్టి ఆయన స్కీమ్ కాదు. అది ప్రభుత్వ స్కీమ్. ప్రజలకు ఉచితంగా ఇచ్చినా.. డబ్బులు వసూలు చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేం లేదు..లాభమేం లేదు. కానీ.. ఆయన సొంత సొమ్ముతో కట్టించినట్లుగా.. వైసీపీ ప్రచారం చేయడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.

పేదల రుణం రద్దు చేస్తే చంద్రబాబుకు రద్దు చేసినట్లు అవుతుందా..!?

టిడ్కో ఇళ్లు సర్వ సౌకర్యాలతో సిద్ధమయ్యాయి. అవి విలాసంగా కాదు… కేవలం రోజువారీ జీవనానికి అవసరమయ్యే మౌలిక వసతులతో సిద్ధమయ్యాయి. వాటిని లబ్దిదారులకు ఇచ్చి… మిగిలిన వారికి… జగన్ చెప్పినట్లుగా సెంటు స్థలంలో ఇల్లు కట్టివ్వొచ్చు. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల రుణాలను మొత్తం మాఫీ చేయవచ్చు. ఇలా మాఫీ చేస్తే ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు వెళ్లవు. పేదలకు వెళ్తాయి. పైగా ఇది.. నవరత్నాల హామీ కూడా . తాను వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్లు ఇస్తానని జగన్ ప్రకటించారు కూడా. ఇప్పటికే తీసుకున్న రుణాలన్నీ రద్దు చేస్తానని కూడా ప్రకటించారు. లబ్దిదారులు కూడా ఆ ఇంటిని చంద్రబాబు ఇచ్చారని చూసుకోరు.. ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటారు. కానీ.. ఆ ఇళ్లపై చంద్రబాబు ముద్ర వేసేందుకు ఏపీ సర్కార్ కోట్లు ఖర్చు పెడుతోంది.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా ఇళ్లిచ్చేస్తున్నారా..!?

జగన్ 30 లక్షల ఇళ్ల స్థలాలను పంచడానికి సిద్ధమయ్యారు. ఇదో గొప్ప కార్యక్రమమే. కానీ కట్టిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు.. చంద్రబాబు పేరుతో రాజకీయం చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. అసలు చంద్రబాబు ప్రస్తావన తీసుకు రాకుండా.. టిడ్కో ఇళ్లను వారికి ఇచ్చి.. వారి రుణాలను రద్దు చేసి… జగనన్న.. వైఎస్ఆర్ కాలనీ పేర్లు పెట్టేసుకుంటే..ఎవరు అడుగుతారు..? లబ్దిదారులు కూడా.. సంతోష పడతారు కదా..! కానీ కోట్లు ఖర్చు పెట్టి రాజకీయం ఎందుకు..? అధికారం పోయిన రెండేళ్ల తర్వాత కూడా.. చంద్రబాబు ఇళ్లిస్తున్నారన్న భావన కల్పించడం ఎందుకు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close