కేసీఆర్‌కు భయపడే బీజేపీ బలగం దిగిందా..!?

తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు క్యూ కట్టడాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తన జాతీయ రాజకీయ దృక్పథం..వారి వెన్నులో వణుకు పుట్టిస్తోందని.. తానుఢిల్లీ వస్తే వారి కుర్చీ కిందకు నీళ్లు వస్తాయన్న కారణంగానే.. తనను ఆపడానికే వారందరూ.. హైదరాబాద్ తరలి వస్తున్నారన‌్నట్లుగా చెప్పడం ప్రారంభించారు. ఇది వినే వారికి కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తోంది. బీజేపీ నేతలు ఎద్దేవా చేయడానికి అస్త్రగా మారుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ఇంత వరకూ జాతీయ రాజకీయాల జోలికే వెళ్లలేదు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే.. కేసీఆర్ ఆ జట్టు జోలికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు.. బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెబుతున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ గురించి తరచూ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన వర్గం మీడియాకు లీకులు ఇస్తూ ఉంటుంది. గతంలో నయా భారత్ పేరుతో కొత్త పార్టీని కన్ఫర్మ్ చేశారని..ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం అదేం లేదన్నారు. కానీ తరచూ.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని.. కొత్త పార్టీ అవసరం ఉందని చెబుతూ ఉంటారు. తానే ఆ కొత్త పార్టీ పెడతానన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకటనలను. గ్రేటర్ లాంటి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు. తనను ఆపడానికే బీజేపీ నేతలు ప్రచారానికి వస్తున్నారని చెప్పడం ప్రారంభించారు.

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఎవరికీ స్కోప్ లేదు. మొత్తం మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనను ఎదిరించిన ఎవరైనా.. ఆయారాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోయినా.. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది. అన్ని చోట్లా అదే జరిగింది. అందుకే.. చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ కూడా.. నిన్నామొన్నటిదాకా అంతే. ఇప్పుడే ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి విమర్శులు చేస్తున్నారు. అప్పుడే ఆయన బీజేపీ తనను టార్గెట్ చేసిందని చెప్పుకోవడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close