బిగ్ బాస్‌‌ తెర వెనక టీమ్‍‌ను నడిపించే తెలుగు సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Sravan Babu, Freelance Journalist

బిగ్ బాస్ చూస్తున్నారా? ఈ ఆర్టికల్ చదువుతున్నారంటే చూస్తూనే ఉండి ఉంటారు. ఇవాళ – రేపు రాత్రి 9 గంటలయితే, కాలనీలలో రోడ్డుమీద వెళ్ళే ప్రతివాళ్ళకూ ఇళ్ళనుంచి బిగ్ బాస్ సిగ్నేచర్ ట్యూన్ విడపడటం పరిపాటి అయిపోయింది. అయితే ఈ బిగ్ బాస్ షో ను తెరవెనక నడిపించే బ్యాక్ ఎండ్ టీమ్‌ ఎవరు, వారు తెలుగువారేనా, వారి విశేషాలు ఏమిటి అనే ఆలోచన అసలు మీకు వచ్చిందా!

బిగ్ బాస్ కాన్సెప్ట్ విదేశీయులదైనా, ఇక్కడ ప్రాంతీయ భాషలలో నిర్వహణను మాత్రం ఆయా భాషలకు సంబంధించిన నిపుణులే నిర్వహిస్తారు. మరి కాకపోతే, హౌస్ మేట్స్ ఎంపిక, వారితో కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, వారికి నిబంధనలు అర్థమయ్యేలా చెప్పటం వంటిపనులు విదేశీయులు చేయలేరు కదా! అయితే ఈ ప్రక్రియను వెనకనుంచి నిర్వహించే స్థానిక వ్యక్తుల వివరాలుమాత్రం రహస్యంగా ఉంచుతారు.

కానీ, తెలుగు బిగ్ బాస్ వెనకున్న టీమ్‌ను ప్రస్తుతం నడిపిస్తున్న ప్రధాన వ్యక్తి ఎవరనే రహస్య సమాచారంమాత్రం ఇటీవల బట్టబయలు అయింది. రహస్యాలను బయటపెట్టటంలో పేరుగాంచిన అక్కినేనివారి కోడలు సమంతా రూత్ ప్రభు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

అదెలా జరిగిందంటే, తన మామగారు షూటింగ్ కోసం ఇటీవల కులూ మనాలి వెళ్ళటంతో బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలను సమంతా తీసుకున్నారు. విజయదశమినాటి ఆ ఎపిసోడ్‌ మెగా ఎపిసోడ్(సుదీర్ఘమైనది) కూడా. ఇంతకుముందు ఇలాంటి హోస్టింగ్ అనుభవం లేకపోయినా ఆ ఎపిసోడ్‌ను మొత్తం మీద విజయవంతంగా ఆమె పూర్తి చేశారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఆమె ఆ మరసటిరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అప్పుడు ఈ బిగ్ బాస్ బ్యాక్ ఎండ్ టీమ్‌ను నడిపిస్తున్న ప్రముఖుడి పేరు సమంతా బయటపెట్టారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది.

https://www.instagram.com/p/CG60FBprEZT/?utm_source=ig_web_copy_link

ఆ మెగా ఎపిసోడ్‌ హోస్టింగ్‌లో తనను చేయిపట్టి వెనకుండి నడిపించిన జీకే మోహన్‌కు సమంతా కృతజ్ఞతలు తెలపటంద్వారా షో బ్యాక్ ఎండ్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరో చెప్పకనే చెప్పారు. సమంతాకు ఇలా రహస్యాలు బయటపెట్టటం మొదటిసారి కాదు. మనం సినిమా సందర్భంలోకూడా ఆమె ఇలాగే చేశారు. సినిమాలో క్లైమాక్స్‌లో అఖిల్ ఒక చిన్న క్యామియో – అతిథి పాత్రలో తళుక్కున మెరుస్తారుకదా. ఆ విషయాన్ని విక్రమ్ కుమార్ బృందం సినిమా విడుదలయ్యేవరకు రహస్యంగానే ఉంచాలని అనుకుంది. కానీ మన హీరోయిన్ గారు సినిమా నిర్మాణంలో ఉండగానే అఖిల్ నటిస్తున్న విషయాన్ని ఇలాగే సోషల్ మీడియాలో చెప్పేసి చిత్ర బృందం వేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ తుస్సుమనిపించారు.

ఇంతకూ ఈ జీకే మోహన్ ఎవరన్నదీ చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈయన తెలుగు టీవీమీడియాలో ఒక దిగ్గజంలాంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. నాటి దూరదర్శన్‌ రోజులనుంచి ఇప్పటివరకు అనేక ఛానల్స్‌లో తెలుగు సీరియల్స్, రియాలిటీ షోల వెనక ఈయనే ఉంటారు. ఝాన్సీ, అనితా చౌదరి, సుమ వంటి వారు దూరదర్శన్ రోజులనుంచి ఈయన దగ్గర పనిచేశారు. జెమినిలో నాటి చెప్పుకోండి చూద్దాంవంటి నేటిదాకా ఈయన ఎన్నో రియాలిటీ షోలకు ఈయన రూపకల్పన చేశారు. కాన్సెప్ట్స్ పేరుతో సొంత టీవీ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. జెమిని కిరణ్‌కు అత్యంత ఆప్తులు.

ఈయనకు సంబంధించి మరో ముఖ్య విశేషమేమిటంటే, మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత టీమ్‌ను కూడా ఈయన పర్యవేక్షిస్తుంటారు. చిరంజీవి వ్యక్తిగత వ్యవహారాలు అన్నీ ఈయన చేతులమీదగానే జరుగుతుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close