జ‌గ‌న్ కు స‌న్మానం… ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌

చిత్ర‌సీమ‌కు, జ‌గ‌న్ కూ ఓ అనుకోని గ్యాప్ ఉన్న మాట వాస్త‌వం. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే, చిత్ర‌సీమ త‌ర‌పున ఓ బృందం అంటూ వెళ్లి క‌ల‌వ‌లేదు. స‌న్మాన‌మూ చేయ‌లేదు. అస‌లు త‌న‌ని చిత్రసీమ ముఖ్య‌మంత్రి గానే గుర్తించ‌లేద‌ని, జ‌గ‌న్ బాధ‌ప‌డ్డార‌ని, ఆయ‌న మ‌నుషులే చెబుతుంటారు. `మీ దృష్టిలో మా నాయ‌కుడు ముఖ్యమంత్రే కాదా` అని చిత్ర‌సీమ‌ని ఉద్దేశించి మంత్రులు కోపోద్రేకానికి గురైన దాఖ‌లాలూ ఉన్నాయి. అప్ప‌ట్లో సీఎంని క‌ల‌వ‌క‌పోవ‌డం వ‌ల్లే, ఇప్పుడు ఇన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్న‌ది కొంత‌మంది నిర్మాత‌ల వాద‌న‌.

ఏదేమైనా ఇప్పుడు ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డుతున్నాయి. జ‌గ‌న్‌- చిరంజీవి భేటీ వ‌ల్ల ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ద్వారాలు తెరచిన‌ట్టైంది. ఇప్పుడు కాక‌పోయినా, అతి త్వ‌ర‌లో ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తాయి. వ‌చ్చినా, రాక‌పోయినా, ప‌రిశ్ర‌మ జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో హ్యాపీగా ఉన్నా, లేక‌పోయినా.. అతి త్వ‌ర‌లో ప‌రిశ్ర‌మ త‌ర‌పున జ‌గ‌న్ కి ఓ భారీ సన్మాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ టాక్‌. టాలీవుడ్‌లో కొంత‌మంది అగ్ర నిర్మాత‌లు ఓ క‌మిటీగా ఏర్ప‌డి జ‌గ‌న్ కి సన్మానం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని టాక్‌.

అప్ప‌ట్లో.. అంటే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన కొత్త‌లోనే ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ట‌. కానీ కొంత‌మంది నిర్మాత‌లు `వ‌ద్దు` అంటూ వెన‌క్కిలాగార‌ని, అందుకే స‌న్మానం జ‌ర‌గ‌లేద‌ని టాక్‌. ఈ విష‌య‌మై ప్ర‌ముఖ నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ స్పందించారు. అప్ప‌ట్లోనే జ‌గ‌న్ ని స‌న్మానించాల‌ని అనుకున్నామ‌ని, కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర్లేద‌ని, చిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ అంటే ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్తులంద‌రికీ గౌర‌వం ఉంద‌ని, ఆయ‌న్ని ప‌ట్టించుకోలేద‌నో, స‌న్మానం చేయ‌లేద‌నో ఆయ‌న కోప‌గించుకునే వ్య‌క్తి కాద‌ని, ఆయ‌న అంత సంకుచిత స్వ‌భావి కాద‌ని, అయితే ఆయ‌న్ని త్వ‌ర‌లోనే స‌న్మానిస్తామ‌ని ఎన్వీ ప్ర‌సాద్ ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే, ప‌రిశ్ర‌మ ఏక‌మై.. సీఎం జ‌గ‌న్ స‌న్మాన కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టే రోజు ఎంతో దూరంలో లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close