‘లైగ‌ర్‌’ త‌ర‌వాత రౌడీ బ్రేక్ తీసుకోవాల్సిందేనా?

విజ‌య్ దేవ‌ర‌కొండ దృష్టంతా ఇప్పుడు ‘లైగ‌ర్‌’ ప్ర‌మోషన్ల మీదే ఉంది. ఈ సినిమా అవ్వ‌గానే ‘ఖుషి’ సెట్స్‌లో పాల్గొనాలి. మ‌రోవైపు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ కూడా ఉంది. అయితే.. `లైగ‌ర్‌` త‌ర‌వాత విజ‌య్ కనీసం నాలుగు వారాల బ్రేక్ తీసుకోబోతున్నాడ‌ని టాక్‌. విజ‌య్ ప్ర‌స్తుతం విప‌రీత‌మైన న‌డుం నొప్పితో బాధ ప‌డుతున్నాడు. ఆ నొప్పిని పంటికింద బిగ‌బెట్టుకొని మ‌రీ ‘లైగ‌ర్‌’ ప్ర‌మోష‌న్ల‌లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నాడు. లైగ‌ర్ 25న వ‌చ్చేస్తోంది. త‌న ప్ర‌మోష‌న్ల ప‌ని అయిపోగానే.. మీడియాకు, సినిమాకూ, షూటింగుల‌కూ క‌నీసం నెల రోజులు దూరంగా ఉంబోతున్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొని అప్పుడు `ఖుషి` సెట్స్‌కి ఎప్పుడు వెళ్లాలి? అనే నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని టాక్‌.

`లైగ‌ర్` మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో సాగిన సినిమా. ఈ సినిమాలోని బాక్స‌ర్ పాత్ర కోసం.. విజ‌య్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడు, ప్రొఫెష‌ష‌న‌ల్ బాక్స‌ర్ల ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకొన్నాడు. ఈక్ర‌మంలో.. న‌డుం నొప్పి మొద‌లైంది. ఇప్పుడు అది భ‌రించ‌లేనంత‌గా మారింద‌ని తెలుస్తోంది. అందుకే `లైగ‌ర్` త‌ర‌వాత బ్రేక్ తీసుకోవ‌డం అత్య‌వ‌స‌ర‌మైంది. విజ‌య్ బ్రేక్ వ‌ల్ల `ఖుషి` షూటింగ్ లేట‌వుతుంది. ఈ డిసెంబ‌రులోనే `ఖుషి`ని రిలీజ్ చేయాల‌నుకొన్నారు. నెల రోజులు షూటింగ్ కి గ్యాప్ వ‌స్తే… ‘ఖుషి’ ఆల‌స్య‌మ‌య్యే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ఎందుకీ ఖర్మ : ఓ వైపు జీతాలివ్వలేని దైన్యం – మరో వైపు దుబారా !

ఆంధ్రప్రదేశ్‌లో దుర్భర దారిద్ర్యం కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి పనులు చేసిన వాళ్లకి బిల్లులు రావడం లేదు. ఉద్యోగం చేసిన వారికి జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. జీతం ఇవ్వండి మహా...

బంగ్లాదేశ్ కి సిరీస్ సమర్పించుకున్న భారత్

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ కి షాక్ తగిలింది. మూడు వన్డేల సిరిస్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు సీరిస్ ని కోల్పోయింది. తొలి వన్డే లో ఒక్క వికెట్...

అప్పట్లో వైఎస్ కుయ్.. కుయ్ – ఇప్పుడు కేసీఆర్ టింగ్..టింగ్ !

రాజకీయ నేతలు ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎక్కువగా భాషా ప్రయోగాల్లోనే ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి గెలవడానికి చేసిన కొన్ని ప్రచార ట్రిక్కుల్లో తాను 108...

చంద్రబాబును నమ్మవద్దు ప్లీజ్ – బీసీ సభలో వైసీపీ చెప్పింది ఇదే !

జయహో బీసీ పేరుతో అన్ని జిల్లాల నుంచి జనాలను సమీకరించి విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఇందిరాంధీ స్టేడియం కెపాసిటీ పది వేలు కూడా ఉండదు. అంత చిన్న గ్రౌండ్‌లో పెట్టి ఎనభై వేల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close