కిరణ్ కాంగ్రెస్‌లో చేరితే టీడీపీకి పండగే..! ఎలాగంటే..?

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఎక్కువగా లాభపడేది తెలుగుదేశం పార్టీనే. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ కనిపించడం లేదు. ఏ వర్గం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. ఏదో ఓ వర్గాన్ని బలమైన మద్దతుదారులుగా మార్చుకుంటే తప్ప.. కాంగ్రెస్‌కు ఓ బలమంటూ రాదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే.. అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ముందుగా నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే.. వైసీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం గుంపగుత్తగా ఆ పార్టీకి వెళ్లింది. కాంగ్రెస్ మళ్లీ బలం సంపాదించుకోవాలంటే..ఆ ఓటు బ్యాంకును తమ వైపు ఆకర్షించుకోవాలి.

కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజుల కిందటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటే.. కాంగ్రెస్ బలపడటం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీతో ఉందని.. ఆ పార్టీ బలహీనపడితేనే.. కాంగ్రెస్ బలపడుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ గాంధీ కూడా..ఇటీవల తనను కలిసిన నేతలతో.. వైసీపీపై ఎందుకంత…మెతకగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారని చెబుతున్నారు. వైసీపీపై దూకుడుగా వెళ్లాలని..రాహుల్ ఆదేశించడానికి కారణం… కిరణ్ సూచనలేనంటున్నారు. ఇప్పుడు కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ తరువాత వైసీపీపై దాడిని తీవ్రం చేస్తే…రాజకీయంగా కొంత సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ బలపడటం ప్రారంభిస్తే.. ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్ గా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ విషయంలో వైసీపీ మెతక వైఖరితో ఉండటంతో ఈ వర్గాలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు మళ్లేందుకు ఈ వర్గం పూర్తిగా సిద్ధపడకపోవచ్చు. బీజేపీతో పోరాటం చేస్తున్నప్పటికీ…టీడీపీపై ఉన్న వ్యతిరేకత మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొంత మంది అనివార్యంగా వైసీపీతో ఉండాల్సి వచ్చేది. కానీ కిరణ్ కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే.. ఇలాంటి వారందరికీ కాంగ్రెస్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే.. వైసీపీ టార్గెట్ గానే రాజకీయాలు జరిగే అవకాశాలున్నాయి.

గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే… వైఎస్ జగన్.. తన పొలిటికల్ గేమ్ ఆడారు. ఆ సమయంలో కిరణ్ ను జగన్ రాజకీయంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే.. కిరణ్ కమార్ రెడ్డి.. జగన్ తో అదే గేమ్ ఆడే అవకాశం ఉంది. జగన్ కు అండగా నిలబడే అవకాశం ఉన్న సామాజికవర్గాన్ని కిరణ్ కుమార్ రెడ్డి.. ఐదారు శాతం ఓట్లు కాంగ్రెస్ సాధించి పెట్టినా అది వైసీపీకి చాలా మైనస్ అవుతుంది. అంటే ఆ మేరకు టీడీపీకి ప్లస్‌గా మారినట్లే…‍‍‍‍‍‍‍

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close