`ఐఎస్ఐఎస్’ జీతాల్లో 50 శాతం కట్

`ఐఎస్ఐఎస్’ – కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఈ టెర్రర్ గ్రూప్ ఇప్పుడు ఆర్థిక ఊబిలో కూరుకుపోయింది. జీతాలు కూడా సరిగా చెల్లించలేని దారుణమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నది. ఎందుకలా జరిగింది ?

ఉగ్రవాదులను తమ సంస్థలోకి చేర్చుకోవడంలో ఆకర్షణీయమైన జీతాలను ప్రకటిస్తూ నిన్నమొన్నటిదాకా ఊరించిన సంస్థ ఇప్పుడు దివాళా స్థితికి చేరువైంది. ఐఎస్ఐఎస్ ఆర్థిక వ్యవహారాలు చూసే కోశాగార మంత్రిత్వ శాఖ `Bayt al-Mal’ దాదాపు చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ఉగ్రవాద ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత పెట్టింది. అయినా పరిస్థితి చక్కదిద్దలేకపోతున్నది.

నిన్నమొన్నటిదాకా కనీవినీ ఎరుగని జీతాలు.. ఆపైన భారీ పారితోషికాలు. ఇంకా మెరుగైన ఆధునిక సౌకర్యాలు.. ప్రకటిస్తూ, అనేక దేశాల్లోని యువతను ఉచ్చులోకి లాగిన ఐఎస్ఐఎస్ ఉన్నట్టుండి జీతాలు కూడా సరిగా చెల్లించలేని స్థితికి వెళ్ళిందని తెలియగానే ఉగ్రవాద ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొలకెత్తింది. ఈ అనూహ్య పరిణామంతో వారంతా తెల్లబోతున్నారు.

ఇస్లామిక్ రాజ్యస్థాపన ధ్యేయంగా జీహాద్ పోరాటం ప్రకటించిన ఈ ఉగ్రవాద సంస్థ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణం ఏమిటి? దీనికి ఈ టెర్రర్ గ్రూప్ కోశాగార మంత్రిత్వశాఖ ఏ కారణాలను చూపిస్తున్నది ? ఈ పరిస్తితి నుంచి బయటపడేందుకు ఎలాంటి మార్గం ఎంచుకున్నది? ఇలాంటి విషయాలు తాజాగా `జెరూసలేం పోస్ట్’ ప్రకటించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది.

ఈ మధ్యనే ఐఎస్ఐఎస్ కు చెందిన కోశాగార శాఖ ఒక ప్రకటన విడుదలచేస్తూ, అనివార్య పరిస్థితుల్లో జీతాలు 50 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ అనివార్య కారణాలేమిటో మాత్రం వెల్లడించలేదు. ఒక పక్క అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతున్న నేపథ్యంలోనే ఈ తరహా ప్రకటన వెలువడటం గమనార్హం. ఇరాక్ ఉత్తర భాగంలో ఉన్నMosul నగరంలోనే ఉగ్రవాద సంస్థ కోశాగార కేంద్రం ఉంది. దీనిపై కూడా వైమానిక దాడులు జరిగాయి. కోశాగారంలోని లక్షలాదిగా కరెన్సీ నోట్లు ఈ దాడుల్లో కాలిబూడిదైనట్లు చెబుతున్నారు. దీంతో సంస్థ ఆర్థిక పతనం మొదలైంది. డిసెంబర్ లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

విరాళాల రూపంలో సేకరించిన డబ్బునంతా ఈ నగరంలోనే దాస్తుంటారు. ఈ విషయాన్ని గ్రహించిన సంకీర్ణ దళాలు ఉగ్రవాద ఆర్థిక స్థావరంపై దెబ్బకొట్టింది. అప్పటినుంచీ ఉగ్రవాద ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలైంది. ఒకపక్క జీతాలు, ఇతర ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో సంస్థకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఐఎస్ఐఎస్ తీవ్రంగాప్రయత్నిస్తోంది. ప్రజల నుంచి పన్నులు పిండైనా కోశాగారం పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడమూ జిహాద్ లో భాగమేనంటూ విరాళాల కోసం ప్రచారం చేస్తోంది.

కాగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో భారీ జీతభత్యాలు చూసే అనేక దేశాల నుంచి ఉగ్రవాదులుగా చేరిపోవాలనుకుంటున్న యువతకు ఇది శరాఘాతమే. దీంతో వారి ఆలోచనలకు బ్రేక్ పడవచ్చు. గతంలోలాగా ఆఫర్ రాగానే ఎగిరిగంతేసి ఈ ఉగ్రవాద సంస్థలో చేరేపరిస్థితి ఇప్పుడు లేదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఇది పరోక్షంగా ఉగ్రవాద సంస్థను నిర్వీర్యం చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకు ముందు అల్ ఖైదాకు పట్టిన గతే దీనికి పడుతుందన్న ధీమా అమెరికా వ్యక్తం చేస్తోంది. అయితే, ఆదమరచి నిద్రపోయే స్థితి ఇంకా రాలేదన్నది మాత్రం వాస్తవం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close