అందుకు రాలేదుట..కానీ అదే మాట్లాడారు ఎందుకో?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడంపై మజ్లీస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు చాలా చురుకుగా స్పందించాయి. ఆ విద్యార్ధి మృతికి సంతాపం, అతని కుటుంబానికి సానుభూతి, అతని తోటి విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతున్నాయి. అయితే వారి హడావుడి వెనుక అసలు ఉద్దేశ్యాలు ఏమిటో అందరికీ తెలుసు. వారికి నిజంగా విద్యార్ధుల మీద అంత ప్రేమ అభిమానం ఉండి ఉంటే గత పదిరోజులుగా సస్పెండ్ అయిన విద్యార్ధులు యూనివర్సిటీ ముందు టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేస్తునప్పుడే వచ్చి వారికి సంఘీభావం ప్రకటించి, వారిపై యూనివర్సిటీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు కృషి చేసి ఉండి ఉంటే రోహిత్ ప్రాణాలు కోల్పోయేవాడే కాదు. అప్పుడు చూపని ఆసక్తి ఇప్పుడే ఎందుకు చూపుతున్నారో అందరికీ తెలుసు.

అందుకే మజ్లీస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై గట్టిగా మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మరొక అడుగుముందుకు వేసి రాహుల్ గాంధినే బరిలోకి దింపింది. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడికి రాలేదు అని చెపుతూనే, విద్యార్ధులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అసహన వైఖరి గురించి రాహుల్ గాంధి ప్రస్తావించేరు. కేంద్రం వైఖరే ఇక్కడ యూనివర్సిటీలో కూడా ప్రతిఫలిస్తోందని అన్నారు. ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్చ ఉండాలని, దానిని కొన్ని యూనివర్సిటీలు కులం, మతం, ప్రాంతం పేరిట హరించివేస్తున్నాయని అన్నారు. రోహిత్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు.

రాహుల్ గాంధీ చెపుతున్న భావప్రకటన స్వేచ్చకి రోహిత్ ఆత్మహత్యకి ఎటువంటి సంబందమూ లేదు. వేరే ఇతర కారణాల చేత రోహిత్, మరి కొందరు విద్యార్ధులు సస్పెండ్ అయ్యారు. కానీ రాహుల్ గాంధి ఈ ఘటనని తన రాజకీయ ప్రత్యర్ధి ప్రధాని నరేంద్ర మోడితో ముడిపెట్టే ప్రయత్నంలో భావ ప్రకటన స్వేచ్చ ప్రస్తావన తీసుకువచ్చినట్లు భావించవచ్చును. రాజకీయాలు చేయడానికి రాలేదని చెపుతూనే మళ్ళీ ఈవిధంగా రాజకీయాలు చేసారు. డిల్లీ వెళ్లిన తరువాత ఈ సంఘటన ఆధారంగా బహుశః మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడిని, కేంద్రమంత్రులపై మళ్ళీ విమర్శలు గుప్పిస్తారేమో?

ఇటువంటి మూస రాజకీయ పద్దతులకు అలవాటు పడిన తన కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని రాహుల్ గాంధి ఇదివరకు చెప్పేవారు. ఒక నూతన దృక్పధం, నూతన ఆలోచనా విధానాలు, యువశక్తితో కూడిన ఒక నూతన కాంగ్రెస్ పార్టీని అవిష్కరించాలనేది తన కోరిక అని చెప్పేవారు. కానీ చివరికి తనే ఆ కాంగ్రెస్ పార్టీ చట్రంలో ఒద్దికగా ఇమిడిపోయి అదే మూస పద్దతులలో రాజకీయాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close