ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్‌: స‌గం మెంట‌ల్‌.. స‌గం భోజ్‌పురి విల‌న్‌

పూరి జ‌గ‌న్నాథ్ అంటేనే మాస్‌. రామ్ అంటే ఎన‌ర్జీ. ఇవి రెండూ డ‌బుల్ డోస్‌లో క‌నిపిస్తే… అది ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. టైటిల్‌లో ఎంత మాస్ ఉందో…. రామ్ క్యారెక్ట‌ర్ అంత‌కంటే డ‌బుల్ ట్రిపుల్ మాసీగా తీర్చిదిద్దాడు పూరి. రామ్ లుక్‌, పోస్ట‌ర్లు, ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన ప్ర‌చార చిత్రాలు చూస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇప్పుడు… ట్రైల‌ర్‌ని రంగంలోకి దింపాడు. ఈసారి మాస్ మ‌సాలా ఇంకాస్త ఎక్కువ‌గా త‌గిలేసింది. పూరి డైలాగులు, రామ్ చూపిస్తున్న టెంపో, ట్రైల‌ర్ క‌ట్ చేసిన విధానం చూస్తుంటే ఈ సినిమా ‘బౌండ‌రీలు’ దాటేసేంత మాసీగా అనిపిస్తోంది.

పూరి సినిమాల్లో హీరోలే మాసీ డైలాగులు చెప్పేవారు.. ఇప్పుడు.. ఈ సినిమాలో హీరోయినూ రెడీ అయ్యింది. న‌భా న‌టేషా ‘రేయ్‌… వ‌రంగ‌ల్ కాలేజీలో పోర‌గాళ్ల‌ని ఉచ్చ పోయించినా’ అంటూ రామ్ ద‌గ్గ‌రే క‌టింగ్ ఇచ్చింది. ఈ డైలాగ్ చాలు. ఈ సినిమాలో మాస్‌, మ‌సాలా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌డానికి.

”పిల్లి గుడ్డిదైతే ఎల‌క ఎగిరెగిరి చూపించింద‌ట‌”
”నీ జాతిలో నా పుల్ల‌…”
– అంటూ రామ్ కూడా (బూతు) డోసు పెంచాడు.

అయితే హీరోయిజానికి ఎక్క‌డా కొద‌వ చూపించ‌లేదు.
నేను జైల్ నుంచి త‌ప్పించుకున్న‌ది బార్కాజ్ బిర్యానీ తిన్నీకి కాద్‌… యాట కోయ్య‌నీకి..
అబే.. పెద్ద‌మ్మ గుడిలో నిన్ను మొక్కి చాణ్ణాళ్లైంది. నా యాట నువ్వేన‌ని ఒట్టేసినా.. నా పొట్టేల్ నువ్వే
ఖాళీపీలీ లొల్లొద్దూ… చుప్ చాప్ ఇంటిపోయి.. మీ పెండ్లాం ప‌క్క‌న ప‌డుకోరీ..
అంటూ తెలంగాణ‌, హైద‌రాబాదీ యాస‌లో రామ్ రెచ్చిపోయి డైలాగులు ప‌లికాడు. రామ్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగులు ప‌లికిన విధానం.. ఇదిర‌వ‌క‌టికంటే కొత్త‌గా అనిపిస్తాయి. మాస్‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఈ స్ట‌ఫ్ చాలు.

మ‌రి ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ క‌థేంటి?

– ఈ విష‌యాన్నీ ట్రైల‌ర్‌లోనే చెప్పేశాడు.
”అన్నా పోలీసులు నీకు డిప్ప‌లో సిమ్ కార్డు పెట్టినార‌న్నా” అంటూ గెట‌ప్ శ్రీ‌నుతో ఓ డైలాగ్ ప‌లికించారు.
”దీన్త‌ల్లీ… నా దిమాఖ్ ఏందిరా, డ‌బుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్క వుంది” అంటూ రామ్ చెప్ప‌డం బ‌ట్టి చూస్తే… ఒక వ్య‌క్తిలో రెండు బుర్ర‌లు చేసే మ్యాజిక్ ఈ సినిమా అని అర్థం అవుతుంది.
ఏ హౌలేకా భేజా ఠీక్ న‌హీహై..స‌గం మెంట‌ల్‌.. స‌గం భోజ్‌పురి విల‌న్ – అంటూ విల‌న్లు గాభ‌రా ప‌డిపోవ‌డం చూస్తుంటే ఈ కాన్సెప్ట్ తోనే హీరో.. విల‌న్ల‌తో ఆడేసుకోవ‌డం మొద‌లెట్టాడ‌న్న‌మాట‌. మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్‌, పూరి చూపించిన విజువ‌ల్స్‌, న‌భా న‌టేషా గ్లామ‌ర్ ఇవ‌న్నీ ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్‌. మొత్తానికి ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ మాస్‌ని మెప్పించేలా క‌నిపిస్తోంది. ఆ ప్ర‌య‌త్నంలో డోసు కాస్త ఎక్కువైన‌ట్టు అనిపించినా – త‌ప్ప‌దు.. ప్ర‌స్తుతం ట్రెండ్ అదే క‌దా? పూరి కూడా ఫాలోయిపోయాడ‌నుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.