సక్సెస్..! భారత్‌దే ఇక “చంద్రయానం..!”

రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇప్పటి వరకూ చంద్రునిపైకి ల్యాండర్, రోవర్ లని పంపాయి. అమెరికా అయితే ఏకంగా వ్యోమగాములనే పంపింది. అయినా… అక్కడి పూర్తి వివరాలు సేకరించలేకపోయాయి. చంద్రయాన్ 1 ప్రయోగంతోనే చంద్రునిపై నీటిజాడలున్న విషయాన్ని ఇస్రో ప్రపంచానికి చాటింది. పదకొండు ఏళ్ల తరువాత ఇప్పుడు చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి సక్సెస్ చేసింది. ఒక సారి సాంకేతిక లోపంతో వాయిదా పడినా… వారంలోనే… మళ్లీ ప్రయోగానికి ఇస్రో రెడీ అయిన తీరు స్ఫూర్తిదాయం.

చంద్రునిపైనే మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉండొచ్చనేది ఎప్పటి నుంచో ప్రపంచ దేశాల అంచనా… అక్కడ వాతావరణ పరిస్థితులు ఏమిటి?.. ఏ ఏ ఖనిజ నిక్షేపాలున్నాయి?… మనిషి మనుగడ సాధించగలడా?… అక్కడ గ్రహాంతర వాసులు, జంతువులు వంటివి ఏమైనా ఉన్నాయా?… ఇలా ఎన్నెన్నో సందేహాలు ఎన్నో ఏళ్లగా మనుషుల మెదళ్లు తొలిచేస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకునేందుకు రష్యా, అమెరికా, జపాన్, చైనాలతో పాటు మనదేశం విశ్వప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. అందులో భాగమే ఈ చంద్రయాన్ – 2 ప్రయోగం. ఇస్రో రూ.978కోట్లతో ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ ప్రయోగానికి బాహబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్ – 3 రాకెట్ ని ఇస్రో వినియోగించిది. దీని ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లని చంద్రుపైకి పంపనున్నారు. ఆర్బిటర్ క్షక్ష్యలో తిరుగుతూ ఏడాది కాలం పనిచేస్తుంది. ఆర్బిటర్… ల్యాండర్ ని చంద్రునిపైకి దింపుతుంది. ఆ ల్యాండర్ లో ఉండే రోవర్ చంద్రుని ఉపరితలంపై 500 మీటర్ల దూరం ప్రయాణిస్తూ పలు అంశాలని భూమికి చేరవేస్తుంది. ల్యాండర్, రోవర్ లు కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆ వ్యవధిలోనే అన్ని విషయాలు తెలుసుకునేలా ఇస్రో ప్లాన్ చేసింది.

రాకెట్ బరువు 640 కిలోలు. ఆర్బిటర్ బరువు 2379కిలోలు, ల్యాండర్ బరువు 1471 కిలోలు, రోవర్ బరువు 27కిలోలు. ఆర్బిటర్ లో 8, ల్యాండర్ లో 3, ఆరు చక్రాలుండే రోవర్ లో 3 పరికరాలు అమర్చారు. చంద్రునిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఇనుము, సోడియం వంటి ఖనిజాలు, రేడియో తరంగాలు పసిగట్టడం, నీరు, ఐస్ జాడలని అన్వేషించడం, త్వరగా ఆవిరయ్యే ఖనిజాలని గుర్తించడం, సహజసిద్ధంగా ఏర్పడ్డ మౌళిక ఖనిజాలని స్కానింగ్ చేయడం, చంద్రుని పొరపై పర్యావరణ పరిశీలన, రంగులేని ధ్రువాలని కనిపెట్టడం, ఎలక్ట్రాన్ సాంద్రత, ఉష్ణోగ్రతలు, చంద్రకంపాలలో గమన వేగం, వేగ అభివృద్దిని నమోదు చేయడం, పెద్ద పెద్ద శిలలని పరిశీలించి ఖనిజాల మూల పదార్దాలను గుర్తించడం, అలాగే రంగులేని ధ్రువాలని శోధించడం, చంద్రుని లోపలి భాగాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు.

చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా ఈసారి చంద్రుడికి సంబంధించిన అనేక విషయాలని ఇస్రో తెలుసుకోనుంది. ఈ ప్రయోగం సంపూర్ణంగా సక్సెస్ అయి .. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే అగ్రదేశాల సరసన మనదేశం చేరుతోంది. ఇప్పటికే ఎన్నెన్నో ప్రయోగాలు చేపడుతూ కీర్తి ఘడిస్తున్న మరో చరిత్ర సృష్టించనట్టు అవుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత అది వాణిజ్యపరమైన ప్రయోగాలకి ఎంతగానో ఊతమిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close