రవితేజ పారితోషకం తీసుకోకపోవడానికి కారణం అదే

మాస్ మహారాజ రవితేజ హిట్స్ ప్లాప్ల్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో డిస్కోరాజా అనే మూవీ తెరకెక్కుతోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిస్కో రాజా కంటే రవితేజ నెస్ట్ సినిమానే ఇప్పుడు హాట్ టాఫిక్ అయింది.

ఈ సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మహా సముద్రం మూవీ చేయనున్నారు రవితేజ. ఈ మూవీకి సంబంధించి రవితేజ పారితోషికం విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి. మొదట రవితేజ అడిగినంత పారితోషికాన్ని ఇవ్వలేనని నిర్మాత చెప్పాడట. కానీ మహా సముద్రం కథ బాగా నచ్చడంతో అందులో నటించాలని రవితేజ ఫిక్స్ అయ్యాడు. పారితోషికం బదులుగా లాభాల్లో వాటా ఇవ్వడానికి ప్రొడ్యూసర్ ఒప్పుకోవడంతో రవితేజ కూడా సినిమాకు సైన్ చేశాడట.

అజయ్ భూపతి ఈ సినిమాను మల్టీ స్టారర్ మూవీగా తీయనున్నారని ప్రచారం జరుగుతోంది. రవితేజతో పాటు హీరో సిద్ధార్ద్‌ ఇందులో నటించనున్నారు. అజయ్ భూపతి ఆర్‌ఎక్స్ 100 తర్వాత ఏడాదిపాటుగా మహాసముద్రం కథను కట్టుదిట్టంగా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం రవితేజకు కలగడంతోనే పారితోషికం కూడా వద్దనుకున్నాడని టాక్. ఈ మూవీకి మంచి లాభాలు వస్తాయని అందుకే వాటా తీసుకున్న తనకేమీ నష్టంలేదని రవితేజ భావిస్తున్నట్లు వినికిడి. రవితేజ సినిమాలకి హిందీ డబ్బింగ్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ బాగా వస్తాయి. అందువల్లే పారితోషికం కన్నా వాటా తీసుకుంటేనే మంచిదని రవితేజ భావించారట.

ఇక రవితేజ సినిమా గ్రాఫ్ కూడా ఇటీవల బాగా పడిపోయింది. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలన్నీ డిజాస్టర్‌లే. అలాగే మహాసముద్రంలో నటించే మరో హీరో సిద్దార్థ్ కూడా ఒక్క హిట్ కోసం వేచి చూస్తున్నారు. చాలా ఏళ్లుగా సిద్ధార్థ్ కు తెలుగులో హిట్ లేదు. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న వీరిద్దరూ ఇప్పుడు మహాసముద్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుందట. సముద్రంలో జరిగే మాఫియాను కథాంశంగా తీసుకున్నారని టాక్. మాఫియా కార్యక్రమాలను అడ్డుకునే పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటించనున్నారని సమాచారం.

మొదట ఈ కథను నాగ చైతన్యకు చెప్పారు అజయ్. కానీ చైతుకు కథ నచ్చకపోవడంతో రవితేజ వద్దకు వెళ్లాడట. రవితేజకు కథ బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో సమ్మోహనం, అంతరిక్షం సినిమాల్లో హీరోయిన్‌గా అదితిరావు హైదరీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమా హిట్ అయితే మాత్రం రవితేజ అనుకున్నవన్నీ నెరవేరినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్ సేన్‌తో బేరం కుదిరింది

త‌మిళ‌ 'ఓ మై క‌ద‌వులే' రీమేకు హ‌క్కులు పీవీపీ ద‌గ్గ‌రున్నాయి. ఈ సినిమాని విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఆ విష‌యం ముందే మీడియాకు లీకైంది. య‌ధావిధిగా వార్త‌లొచ్చాయి. అయితే విశ్వ‌క్ మాత్రం...

సచివాలయ కూల్చివేత ఇక ముందుకు సాగుతుందా..!?

తెలంగాణ సచివాలయం కూల్చివేత శరవేగంగా చేపట్టినా.. న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. హైకోర్టు సోమవారం వరకూ.. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఆ రోజున విచారణ జరిపి అనుమతి ఇస్తుందా... మరికొంత కాలం పొడిగింపు...

ఏపీ ఆర్టీసీని ఆ అధికారి ముంచేశాడా..!?

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ను ప్రభుత్వం ఆకస్మాత్‌గా బదలీ చేసేసింది. ఆయనను లూప్ లైన్ పోస్టులోకి.. పంపేసింది. ఆర్టీసీ ఎండీగా ఆయనను నియమించి ఆరు నెలలు మాత్రమే అయింది. ఈ లోపే.. హడావుడిగా.....

ఏపీలో జంబో “అడ్వైజర్స్ కేబినెట్”..! కానీ ఒక్కరే ఆల్ ఇన్ వన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం నుంచి అన్ని శాఖలను ముఖ్యమమంత్రి జగన్ తీసేయడంతో... సలహాదారులపై చర్చ ప్రారంభమయింది. అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారు..? వారి జీతభత్యాలేంటి..? వారి ఎవరికి.. ఏ...

HOT NEWS

[X] Close
[X] Close