పాక్ తో మాటకలిపితే – తీవ్రవాదులకు కడుపు మంటే!

పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ముందడుగు వేసిన ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది.

భారత్ – పాక్ సంబంధాలు మెరుగవుతుంటే సహించలేని శక్తులు హింసను సృష్టిస్తాయి. చొరబాటు దారులు ప్రవేశిస్తారు..దాడులు పెరుగుతాయి…పాకిస్తాన్ సైన్యాన్ని సైన్యంలో ఛాందస వాద శక్తులు సైన్యాన్ని నడిపిస్తాయి. పాక్ లో ప్రభుత్వం…సైన్యం మధ్య దాదాపుగా హద్దులు లేవు. పాక్ లో నాలుగైదు రకాల శక్తులున్నాయి. ఈశక్తులు ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఏకకాలంలో లేదా విడివిడిగా ఎలా కావాలనుకుంటే అలా ప్రభావితం చేయగలవు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటనకు వెళ్లి నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపి వచ్చిన వెంటనే పాకిస్తాన్ సరిహద్దుకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడం ఈ కోవకే చెందుతుంది.

1999 లో ప్రధాని వాజ్‌పేయి లాహోర్ వెళ్లారు.పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఇరువురు నేతల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే అదే ఏడాది మే నెలలో కార్గిల్ కనుమలను పాకిస్తాన్ ఆక్రమించే ప్రయత్నం చేసి భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నది. దాంతో ఇరు దేశాల మధ్య మళ్లీ నిశ్శబ్దం…

2008లో ఇరు దేశాలు మళ్లీ చేతులు కలిపే వేళ లష్కరే తొయిబా టెర్రరిస్టులు అదే ఏడాది నవంబరు 26న ముంబయిపై దాడులకు పాల్పడ్డారు. 164 మంది అమాయకులను బలితీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ చర్చలు స్తంభించిపోయాయి. దాడికి పాల్పడిన వారు పాకిస్తాన్‌లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. వారిని భారత్‌కు అప్పగించడానికి పాకిస్తాన్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అయినా సరే భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్‌కు మరో అవకాశం ఇచ్చింది. 2014 మే 26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు. ఆయన కూడా న్యూఢిల్లీ వచ్చారు. ఆ సందర్భంగా మాటా మాటా కలిసింది. తదుపరి చర్చలకు తెర లేచింది. ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం జరపాలని ప్రధానులు నిర్ణయించారు. ఆ దిశగా ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తుండగానే 2014 ఆగస్టు 18న భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపారు.

కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరపడం అన్యాయమని భారత్ చెబుతున్నా వినకుండా ఆయన చేసిన పనితో ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. అదే ఏడాది సార్క్ దేశాల సమావేశం సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు కలిశారు. అక్కడ ఇరు దేశాల అధినేతలు గంటకు పైగా చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనే విధంగా చూశారు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రధాని మోడీ ఉద్దంపూర్‌లో ఎన్నికల ప్రచార సభపై పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజా విసిరారు. భారత భద్రతా దళాలు నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఈ దాడిలో హతమార్చారు. ఈ సందర్భంగా మళ్లీ భారత్ పాక్ చర్చలకు అవరోధం కలిగింది.

ఇలా చర్చలకు ఒక అడుగు ముందుకు పడిన ప్రతిసారీ పాకిస్తాన్ ఉగ్రవాదులు అడ్డం పడుతూనే ఉన్నారు. పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్ నుంచి వచ్చిన ఈ జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులకు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ విధ్వంసం సృష్టించాలనే టార్గెట్ ఇచ్చి పంపారు.

జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్‌ను గతంలో భారత్ అరెస్టు చేయగా 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం అపహరించి 178 మంది ప్రయాణికులకు బదులుగా పట్టుకుని అతడిని ఉగ్రవాదులు విడిపించుకున్నారు. నాటి నుంచీ భారత్‌ను అస్థిరం చేసేందుకు అతడు ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి భారత్‌లోకి పంపిస్తున్నాడు. విధ్వంసం సృష్టిస్తున్నాడు.

చర్చలు ఎలా ప్రారంభించాలా అని ఇరు దేశాల ప్రధానులు ఆలోచిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తమ మనుషులను భారత్‌లో కల్లోలం రేపేందుకు పంపుతున్నాయి. హిమాలయ ప్రాంతాలు మంచుతో కప్పి ఉన్న రోజుల్లో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడుతుంటారు. మంచుకొండలు దాటుకుంటూ భారత్‌లోకి వచ్చేందుకు వారికి ప్రత్యేక శిక్షణనిస్తారు.

అప్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పార్లమెంట్ నిర్మాణంలో భారత్ పాలుపంచుకొంది. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు కూడా చేపడుతోంది. భారత్ – అప్ఘనిస్తాన్ దేశాలకు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇది ప్రమాదకర శక్తులకు నచ్చదు. ఈనేపథ్యంలోనే అప్ఘనిస్తాన్ భారత దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది.

”అయిననూ పోయిరావలె హస్తినకు” అన్నట్టు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటూనే చర్చించుకుంటూనే ఉండాలి. లేకపోతే, చర్చల నుండి భారత్ వైదొలగితే తీవ్రవాదం ఏం కోరుకుందో అదే నెరవేరినట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close