ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాల్లో ఐటీ పార్కులు నిర్మించాలని అనుకుంటోంది. ఇందుకోసం ఐదు వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంత భూమిని గుర్తించారు. విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభమవుతుంది. అప్పట్నుంచి విమానాల రాకపోకలన్నీ. భోగాపురం నుంచే ఉంటాయి. ఈ కారణంగా సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడుతోంది, ఇప్పటికే భూమి ధరలు 30-50% పెరిగాయి.
భోగాపురం సమీప ప్రాంతాలైన డెంకాడ, నతవలస, రవివలస, కంచెరు, గుడెపువలస వంటివి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చదరపు గజానికి రేటు రూ. 20వేలు దాటిపోయిది. విమానాశ్రయం, ఐటీ పార్క్‌లు, ఇన్ఫ్రా అభివృద్ధి హోటల్స్, యూనివర్సిటీలు వల్ల ఇంకా డిమాండ్ పెరుగుతోంది. భోగాపురం సమీపంలో ఇన్వెస్ట్మెంట్ భారీగా రిటర్నులు ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనుకుంటోంది. ఇప్పటికే దిగ్గజం కంపెనీలను ఆహ్వానిస్తోంది. గూగూల్ డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత.. పలు కంపెనీలు తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. కాగ్నిజెంట్ కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది. దీంతో.. విశాఖ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ హబ్‌గా మారనుంది. బోగాపురం విమానాశ్రయం ఆపరేషన్ లోకి వచ్చాక.. విశాఖ వ్యాఫ్తంగా భూముల ధరల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉంది.