రివ్యూ : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’

Itlu Maredumilli Prajaneekam Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ 2.5/5

‘నాంది’ సినిమా అల్లరి నరేష్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుసగా చేసిన కామెడీ, పేరడీలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడం డీలా పడిన నరేష్ కెరీర్ కి కొత్త ‘నాంది’ పడింది. నరేష్ తన పంధాని మార్చుకొని చేసిన ఒక సీరియస్ ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చింది. నాంది ఇచ్చిన స్ఫూర్తితో మరో సీరియస్ కథని ఎంచుకున్నాడు నరేష్. అదే.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. టీజర్, ట్రైలర్ లో మారేడుమిల్లి సోషల్ డ్రామా అనే సంగతి అర్ధమైయింది. సోషల్ ఇష్యూపై సినిమాలు రావడం తగ్గిపోయింది. సమాజంలో వున్న సమస్యలని వెండితెరపై నిలదీయడానికి సినీ రూపకర్తల్లో పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఒక సోషల్ ఇష్యూని తెరపై చూపించాలనుకునే ప్రయత్నం ఏ మేరకు ఆకట్టుకుంది.? ఇంతకీ మారేడుమిల్లి ప్రజల సమస్య ఏమిటి ?

శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) సమాజం పట్ల భాద్యత గల తెలుగు టీచర్. ఎన్నికల విధులు నిర్వహించడానికి ఎలక్షన్ ప్రొసీడింగ్ అధికారిగా అటవీ ప్రాంతమైన మారేడుమిల్లి గ్రామనికి వస్తాడు. మారేడుమిల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గ్రామం. అక్కడ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు. నది దాటడానికి వంతెన లేదు. కనీస మౌలిక సదూపాయలు కావాలని మూడు దశాబ్దాలుగా గ్రామ ప్రజలు ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నా వారి గోడుని పట్టించుకునే నాధుడే లేడు. దీంతో విసిగిపోయిన మారేడుమిల్లి ప్రజలు.. ప్రభుత్వం, అధికారుల పట్ల నిరస గళం వినిపిస్తారు. ఎన్నికల అధికారిగా వెళ్ళిన శ్రీనివాస్ ని అడ్డుకుంటారు. తాము ఓటు వేసే ప్రసక్తేలేదని చెప్పి సహాయ నిరాకరణ చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో శ్రీనివాస్ ఎన్నికలని ఎలా నిర్వహించాడు ? అక్కడ ప్రజలు కోరుకునే స్కూల్, హాస్పిటల్, వంతెన తీసుకురావడానికి శ్రీనివాస్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మారేడుమిల్లి ప్రజల పోరాటం ఫలించిందా లేదా ? అనేది మిగతా కథ.

సమాజంలోని సమస్యలని ఎత్తి చూపి సినిమాలు ఇప్పుడు తగ్గిపోయాయి కానీ 80,90 దశకాల్లో ఇలాంటి సబ్జెక్టలే ఎక్కువ. తర్వాత శంకర్ లాంటి దర్శకులు సోషల్ ఇష్యూస్ పైనే అందరూ మెచ్చే సినిమాలు తీయగలిగారు. దర్శకుడిగా తన తొలి సినిమాకి ఇలాంటి ఒక సోషల్ డ్రామానే ఎంచుకున్నాడు ఏఆర్ మోహన్. ఎన్నికల అధికారిగా శ్రీనివాస్ గ్రామానికి రావడం, గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం, కనకమహా లక్ష్మీ నేపధ్యం.. ఇవన్నీ మారేడుమిల్లి ని పరిచయం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు మనం నిత్యం టీవీ, పేపర్స్ లో కనిపిస్తూనే వుంటాయి. వాటిపై స్క్రీన్ పైచెబుతున్నపుడు ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా చెప్పుంటే బావుండేది. అయితే నదీ ప్రవాహంలో కాన్పు చేయించే సీన్.. దాన్ని డిజైన్ చేసిన విధానం, వాటి చుట్టూ పంచుకొన్న ఎమోష‌న్లు బాగున్నాయి. ఇలా కూడా జరిగేదా? అనిపిస్తుంది. ఆ సీన్ ని దర్శకుడు వాడుకున్న విధానం కూడా ఆకట్టుకుంటుంది. అలాగే శ్రీనివాస్ పాత్రలో తెలుగు భాష గొప్పదనం గురించి మాటల రచయిత పలికించిన తెలుగు భాషా ప్రియుల మనసు గెలుచుకుంటాయి.

దర్శకుడు ఎంచుకున్న ఎన్నికల అధికారి నేపధ్యం హిందీ సినిమా న్యూటన్ ని కొంత గుర్తు చేసినా తర్వాత వచ్చిన కిడ్నాప్ డ్రామా కథని మరో మలుపు తిప్పుతుంది. ఇంటర్వెల్ బాంగ్ లో వచ్చే వ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది. అయితే ఇలాంటి కథలకు సెకండ్ హాఫ్ చాలా కీలకం. ఒక సమస్య ఉత్పన్నమైన తర్వాత దానికి వచ్చే రియాక్షన్స్ ఏమిటనేది ఆసక్తికరం. అయితే దీనిపై దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులని విడిపించడానికి నాలుగు రాయబారాలతోనే ముగింపు వరకూ కాలక్షేపం చేసిన భావన కలుగుతుంది. అలాగే ఈ కథలో కీలకమైన 240 ఓట్లు లెక్కింపు ఎపిసోడ్ పై కూడా సరైన కసరత్తు జరగలేదు. ఓట్ల లెక్కింపు జరగాలంటే అన్నీ ఈవీఎంని లెక్కలోకి తీసుకోవాల్సిందే. స్థానిక నాయకులతో ఎలక్షన్ కమీషన్ మాట్లాడి `పర్లేదు… లెక్కపెట్టేయండి..` అని చూపించడం మితిమీరిన సినిమా లిబార్టీ. అలాగే సెకండ్ హాఫ్ లో కీలకమైన కలెక్టర్ పాత్ర విషయంలో కూడా గంద‌రగోళం కనిపిస్తుంది. ఇందులో వున్న కలెక్టర్ అధికారాలపై చాలా మందికి డౌట్లు వస్తాయి. ఒక అధికారం వాడినపుడు ఇలా రాజ్యాంగంలో వుందని ఒక మాట చెప్పి వాడినట్లేయితే కొంత ఎడ్యుకేట్ చేసినట్లు వుండేది. కలెక్టర్.. సడన్ గా ఆర్మీకి దించేయడం, పోలీసులుని తీసుకెళ్ళి ప్రజలని చితకబాదడం చూస్తే .. ఇతగాడు బ్రిటిష్ కలెక్టరా ? అనిపిస్తుంది. కథ ఊహించినట్లుగానే ముగుస్తుంది. అయితే కలెక్టర్ అడవికి రప్పించడం, గ్రామదైవం వీర భద్రుడు ఎద్దులుగా రావడం, అక్కడో పెద్ద యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా చిత్రీకరీంచారు. అయితే ఎద్దుల ఫైట్ లో సీజీ వర్క్ మరికాస్త ఉన్నతంగా ఉండాల్సింది.

అల్లరి నరేష్ పై కామెడీ బ్రాండ్ పడిపోయింది కానీ అతనిలో చాలా విలక్షణమైన నటుడు వున్నాడు. శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో మరోసారి సహజంగా జీవించే అవకాశం వచ్చింది. ఒక సగటు ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడో అంతే చక్కగా ఆకట్టుకున్నాడు నరేష్. నటన, డైలాగ్ పలకడంలో మరింత పరిణితి కనిపించింది. నిజానికి సగటు హీరో లక్షణాలు లేని పాత్రది. ఇలాంటి పాత్రని చేయాలంటే ముందు కథ, కొత్త పాత్రలపై ఇష్టం వుండాలి. ఇందులో పాత్రల పట్ల తన ఇష్టాన్ని మరోసారి చాటాడు నరేష్. ఆయన స్క్రీన్ ప్రజన్స్ కూడా కొత్తగా వుంది. ఆనంది అందంగా కనిపించింది. చాలాహుందాగా నటించింది. ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్, బాబుగారిగా ప్రవీణ్ అక్కడక్క నవ్విస్తారు. వూరి పెద్దగా కొమరన్, కండ పాత్రలో శ్రీతేజ్ నటన ఆకట్టుకుంటుంది. సంపత్ రాజ్ కి కీలకమైన పాత్రే దక్కింది. రఘుబాబుతో సహా మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.

నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే రెండు పాటలు కూడా వినసొంపుగా వున్నాయి. రాంరెడ్డి చక్కని కెమరాపని కనబరిచారు. అడవిలో చిత్రీకరణ కావడం ఎటు చూసిన పచ్చని ప్రకృతిని అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పనితనం కనిపించింది. అబ్బూరి రవి మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. చాలా సన్నివేశాలు ఆయన మాటల వలనే గుర్తుంటాయి. ఈ కథ ని ఎంచుకోవడంలో నిర్మాత అభిరుచి కనిపించింది. ఒక సోషల్ ఇష్యూ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇది నిజాయితీ గల ప్రయత్నమే. రొటీన్ సినిమాలతో పోల్చుకుంటే ఈ ప్రయత్నం అభినందనీయమే. అయితే ఈ కథని మరింత యంగేజింగా చెప్పుంటే ఫలితం ఇంకా బెటర్ గా వుండేది.

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close