ఈసారి ‘సౌంద‌ర్య‌’ వంతు!

టాలీవుడ్ లో బ‌యోపిక్‌ల జోరు కొన‌సాగుతోంది. కాస్త నేమూ, ఫేమూ ఉన్న‌వాళ్లెవ‌రు? వాళ్ల జీవితాల్లో ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఉన్నాయా? అనే విష‌యంపై ద‌ర్శ‌కులు ఫోక‌స్ చేస్తున్నారు. అవ‌కాశం ఉంటే… బ‌యోపిక్ కి సై అంటున్నారు. తాజాగా ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి దృష్టి.. సౌంద‌ర్య క‌థ‌పై ప‌డింది. టాలీవుడ్ లో మ‌కుటం లేని మ‌హారాణిలా వెలిగింది సౌంద‌ర్య‌. సావిత్రి త‌ర‌వాత‌.. అంతటి పేరు, ఖ్యాతి తెచ్చుకున్న న‌టి సౌంద‌ర్య‌నే. సంసార ప‌క్షమైన పాత్ర‌లు ఎంచుకుంటూ, ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవ‌డం ఈ జ‌న‌రేష‌న్‌కి సాధ్యం కాదేమో.? ఓ త‌రానికి సౌంద‌ర్య క‌ల‌ల రాణి. ఇప్పుడు త‌న క‌థ‌ని వెండి తెర‌పై తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార్ట‌.

అయితే సౌంద‌ర్య క‌థ‌లో గొప్ప మ‌లుపులేం ఉండ‌వు. చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అయితే ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ఒప్పుకోవ‌డం లేదు. త‌న క‌థ‌లో తెలియ‌ని విష‌యాలెన్నో ఉన్నాయ‌ని, అవి ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయ‌ని చెబుతున్నాడ‌ట‌. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతోంద‌ని స‌మాచారం. కాక‌పోతే సౌంద‌ర్య పాత్ర పోషించ‌గ‌ల స‌మ‌ర్థ‌వంత‌మైన న‌టి ఎవ‌ర‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close