జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ గత రెండు మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో డిల్లీకి తరలించి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఆయన వయసు 79 సం.లు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి జమ్మూ కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. అయన కుమార్తె మెహబూబా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అవసరమయితే ఆమెకే ప్రభుత్వ పగ్గాలు కూడా అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు చెపుతున్నారు.


