అమరావతి ఒప్పందం నుంచి జగన్ ప్రభుత్వం వైదొలిగింది. సింగపూర్ సంస్థల నుంచి రూ. 143 కోట్ల లంచం అడిగినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు పర్యటనలో సింగపూర్ మంత్రి ఒకరు ఈ విషయం చెప్పి అమరావతితో ఒప్పందం అనేది ముగిసిపోయిందని ప్రకటించారు. ఏపీలో ఈ అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్ రెడ్డి బ్యాచ్ చావు తెలివితేటలతో తెరపైకి వచ్చింది. తమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఏదో రాయితో కొట్టుకోవడం వైసీపీ స్టైల్. ఇది కూడా అంతే.
సింగపూర్ తో చంద్రబాబు చేసుకున్న ఒప్పందంలో అంతా స్కామేనని ట్రూత్ బాంబ్ పేరుతో చాట భారతం రాశారు. ఆ ఒప్పందం గురించి సాక్షి పేపర్ లో వచ్చిన కథనాలను తీసి పుస్తకంగా వేస్తే ఓ వెయ్యి పేజీలు వస్తుంది. అన్నీ అవాస్తవాలు, అభూతకల్పనలతో.. తనకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే తీసుకుని రాసి పడేశారు. హైకోర్టులో వాదనల సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను గురించి చెప్పారు కానీ.. తీర్పుల గురించి చెప్పలేదు. లంచాలు అడిగి అడ్డంగా దొరికిపోయి.. రద్దు చేసేసిన ఒప్పందం గురించి కొత్తగా చంద్రబాబు స్కాం అంటూ ట్వీట్ చేశారు.
సింగపూర్ తో చేసుకున్న రాజధాని అభివృద్ధి ఒప్పందం ఉభయతారకంగా ఉంటుంది. అభివృద్ధి చేసిన సంస్థలకు కొంత భూమి ఇస్తారు. మిగతా అంతా ఏపీ ప్రభుత్వానికే ఉంటుంది. ఆ సింగపూర్ ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు … పెద్ద ఎత్తున సంస్థల్ని, పెట్టుబడుల్ని కూడా తీసుకు వస్తుంది. అయితే లంచాలకు బేరమాడి.. సింగపూర్ నుంచి రాలేదని ఆ సంస్థల మీద, సింగపూర్ ప్రభుత్వం మీద బురద చల్లేస్తున్న వైసీపీ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ఐదేళ్ల పాలనా కాలంలో కనబడిన ప్రతి దాని మీద దోచుకున్న జగన్ ఇప్పుడు అన్నీ బయట పడుతూంటే..ఇదిగో దోపిడీ చేయబోయారు.. అదిగో దోపిడీ చేయబోయారని కబుర్లాడుతున్నారు. నిజంగా సింగపూర్ సంస్థను రూ.143 కోట్లు అడగకపోతే ఆ విషయం చెప్పాలి కదా !