దొరికితే వంద రోజుల్లో డిస్మిస్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి తగ్గించే లక్ష్యంతో… అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసుల్లో వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. పక్కా ఆధారాలతో దొరికిన వారిపై వంద రోజుల్లో చర్యలు తీసుకోవాలని.. ఒక వేళ తీసుకోకపోతే.. ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. లంచాలు అడుగుతున్న వారి సమాచారాన్ని ఇస్తే.. ఏసీబీ అధికారులు రెయిడ్ చేస్తున్నారు. నేరుగా డబ్బులిచ్చేటప్పుడు పట్టుకుని కేసులు బుక్ చేస్తున్నారు.

అయితే ఇలా రెడ్ ‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ.. ఉద్యోగులపై చర్యలుఉండటం లేదు. అలా కేసులు పాతబడిపోతున్నాయి. కొన్నాళ్లకు.. ఆ ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. మళ్లీ తమ బుద్ది ప్రకారం లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోతోంది. అవినీతి పరుల్ని ఏరివేయడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రభుత్వం… ముందుగా… దొరికిన వారికి కఠిన శిక్షలు.. ఓ టైమ్ లైన్ ప్రకారం వేస్తే.. ఉద్యోగుల్లో భయం పెరుగుతుందన్న భావనకు వచ్చింది. ఏసీబీ అధికారులు కూడా…తాము కష్టపడి ట్రాప్ చేస్తున్న కేసులు నిర్వీర్యం అవుతున్నాయని.. చర్యలు తీసుకోవడంలేదని.. ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.

ఈ క్రమంలో.. ప్రభుత్వం వంద రోజుల టైమ్ లైన్ పెట్టింది. రెడ్ హ్యాండెడ్‌గా.. పక్కా ఆధారాలతో పట్టుకున్న వారిని ఇక వంద రోజుల్లో డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడా కూడా తన.. పర బేధాలతో చర్యలు తీసుకుంటే… ఈ ప్రయత్నమూ నీరుగారి పోయే ప్రమాదం ఉంది. లంచావతారాలందర్నీ ఒకే గాటన కడితే ప్రయత్నం ఫలవంతమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close