విశాఖ రోడ్ల గురించే గడ్కరీని అడిగిన సీఎం..!

ముఖ్యమంమత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవకాశం దొరికినా…విశాఖ ను ప్రమోట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వర్చువల్ పద్దతిలోజరిగింది. ఈ ప్రారంభోత్సవరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. గడ్కరీకి విశాఖ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకమైన విజ్ఞప్తులు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని… అందుకే అక్కడ రోడ్డు ప్రాజెక్టులు చేపట్టాలని గడ్కరీని జగన్‌ కోరారు. బోగాపురంలో ప్రపంచ స్థాయి ఎయిర్ పోర్టు వస్తోందని.. విశాఖ నుంచి బోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖలో రోడ్ల అభివృద్ధి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. బీచ్‌ రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని గడ్కరీని జగన్‌ కోరారు. మూడు రాజధానుల బిల్లు విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టులో ఉంది. అయినప్పటికీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గానే జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్త్తున్నారు. ఎవరేమనుకున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారీ ఎత్తున స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారు.

బోగాపురం ఎయిర్ పోర్టు కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల నుంచి ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని అక్కడ ఎలాంటి సిటీ కట్టవచ్చో… ఆర్కిటెక్చర్ నిపుణులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో… కేంద్రం నుంచి ప్రాజెక్టులను కూడా విశాఖ కోసమే అడుగుతున్నారు జగన్. ఇతర ప్రాంతాల్లోని రోడ్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలను సీఎం ఎందుకు గడ్కరీ ముందు పెట్టలేదని.. ఒక్క విశాఖపైనే ఎందుకు మొత్తం దృష్టి కేంద్రీకరిస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close