ఐపీఎల్ స్టోరీస్‌: దినేష్ కార్తీక్ షాకింగ్ నిర్ణ‌యం

ఈ సీజ‌న్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ‌కి కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు దినేష్ కార్తీక్‌. అయితే.. స‌డ‌న్ గా ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్య‌త‌లు వ‌దులుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని టాక్‌. ఆ బాధ్య‌త‌ని ఇప్పుడు జ‌ట్టులోకి కీల‌క‌మైన స‌భ్యుడైన మోర్గాన్ ని అప్ప‌గించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంద‌ని టాక్‌. ఈ సీజ‌న్‌లో కోల్‌కతా అంతంత మాత్రంగానే రాణిస్తోంది. కెప్టెన్ గానే కాకుండా, ఇటు ఆట‌గాడిగానూ దినేష్ కార్తీక్ విఫ‌లం అవుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ కూర్పుపై కూడా చాలా విమ‌ర్శలు వ‌చ్చాయి. ఫామ్ లో లేని న‌రైన్ ని ఓపెనింగ్ కి పంప‌డం, ఫామ్ లో ఉన్న మోర్గాన్ కి బ్యాటింగ్ చేసే అవ‌కాశం అంత‌గా ఇవ్వ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. దాంతో.. దినేష్ కార్తీక్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అస‌లు జ‌ట్టు యాజ‌మాన్యం దినేష్‌కి కెప్టెన్సీ ఎందుకు అప్ప‌గించిందో అర్థం కాదు. ఇంగ్లండ్ కి వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన మోర్గాన్ లాంటి అనుభ‌వ‌జ్ఞుడు జ‌ట్టులో ఉన్న‌ప్పుడు.. సార‌ధ్య బాధ్య‌త‌లు కూడా త‌న‌కే అప్ప‌గిస్తే బాగుండేది. పైగా దినేష్ కార్తీక్ కి కెప్టెన్ గా అనుభ‌వం చాలా త‌క్కువ‌. అటు కీప‌ర్ గా, ఇటు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్ గా మూడు బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం త‌న‌కు క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఈ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. సీజ‌న్ మ‌ధ్య‌లో కెప్టెన్సీని వ‌దులుకోవ‌డం ఐపీఎల్ లో చాలా అరుదుగా చూస్తుంటాం. జ‌ట్టుని మ‌ళ్లీ విన్నింగ్ రేస్‌లో నిల‌పాలంటే… ఇలాంటి నిర్ణ‌యాలు ఇప్పుడు అవ‌స‌రం కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close