ఉమ్మడి ప్రాజెక్ట్‌పై జగన్ వెనుకడుగు..?

కేసీఆర్ గోదావరి నీళ్లు ఇస్తున్నారు.. తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా బహిరంగంగా ప్రకటించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయకపోయినా.. ప్రత్యామ్నాయంగా ఏపీ భూభాగంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించడమే దీనికి కారణం. పోలవరం నీటిని రాయలసీమకు తరలించేందుకు గత ప్రభుత్వం గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఓ ప్రణాళిక సిద్ధం చేసి.. పల్నాడులో.. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. కొత్త ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు తరలించేందుకు… తెలంగాణతో కలిసి ప్రాజెక్ట్ కట్టే ఆలోచన చేయడంతో.. ఇక అనుసంధానం ఉండదనుకున్నారు. అయితే అనూహ్యంగా… కొత్త నిర్ణయం తీసుకున్నారు.

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం విషయాన్ని జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయడం కన్నా.. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో ఎక్కువ ప్రయోజనమే అంచనాకు ఏపీ సీఎం వచ్చినట్లుగా భావిస్తున్నారు. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడ నుంచి శ్రీశైలం కుడి కాలువ ద్వారా బానకచర్ల వరకు తీసుకెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌కు అప్పగించాలని నిర్దేశించారు. ఈ నివేదిక వచ్చాక కార్యాచరణకు దిగాలని సీఎం యోచిస్తున్నారు. అంతే కాదు.. దీనికి డిసెంబర్ 26వ తేదీన శంకుస్థాపన చేస్తారని.. సాక్షి పత్రిక కూడా ప్రకటించింది.

ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు ఎందుకు వేస్తున్నారనే చర్చ.. అధికారవర్గాల్లో సాగుతోంది. కేసీఆర్‌తో కలిసి నీటిని పంచుకుంటామని.. అదే పనిగా.. చెప్పిన జగన్.. ఒక్క సారిగా… విధానాన్ని మార్చుకోవడంపై… అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఉమ్మడి ప్రాజెక్టుపై.. జగన్ వెనుకడుగు వేయలేదని.. ఆ ప్రాజెక్టు కూడా ఉంటుందని… వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలా అయితే.. రెండు రకాలుగా అనుసంధానం వల్ల ఉపయోగం ఏముంటుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఏది నిజమో. ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close