జగన్ బీసీ గర్జన సభ, జనాల ప్రశ్నలివే

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో జగన్ బీసీ జన వాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌లు కాదు, భారత దేశ కల్చర్‌ను నిలబెట్టిన గొప్పవారు, వెనుకబడ్డ కులాలు కాదు, మన జాతికి వెన్నుముకలు అని అన్నారు జగన్. ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వు కలిగేలా చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు జగన్.

అయితే జగన్ బీసీ గర్జన మీద ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వైకాపా కి రాష్ట్ర శాసనసభ లో ఉన్న బలం మేరకు రెండు సార్లు రాజ్యసభ కు తమ పార్టీ నాయకుల నుంచి పంపే అవకాశం వస్తే, రెండు సార్లు కూడా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల నే జగన్ సూచించారు. 

Click here: 

https://www.telugu360.com/rajya-sabha-nominations-caste-equations-telugu-states-part1/amp

అదే విధంగా, ప్రతి పక్షానికి ఉండే ఏకైక పదవి పిఏసి కమిటీ ని కూడా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేత కే ఇచ్చిన విషయం తెలిసిందే. పిఏసి పదవి ని తమ సొంత సామాజిక వర్గానికి కేటాయించినపుడు పార్టీ లో ముసలం కలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బీసీ గర్జన సభ ను చూసిన జనాలు వీటన్నింటినీ గుర్తు చేస్తున్నారు. పైగా 13 జిల్లాలలో ఏ జిల్లా కు కూడా జగన్, బీసీ లని అధ్యక్షులు గా నియమించలేదు అని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లా సమన్వయ కమిటీ లకి అధ్యక్షులను నియమించే సమయం లో గుర్తు రాని బీసీ లు ఇప్పుడు ఎన్నికల సమయంలో గుర్తు కి వస్తున్నారు అని వారు అంటున్నారు. 

మరి ఈ ప్రశ్నలకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

ఏపీలో 25 కాదు 26 జిల్లాలు..!?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లాల సరిహద్దులపై సిఫార్సు చేసేందుకు కమిటీ నియమించేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది....

తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స..!

వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. టెస్టులు కూడా.....

కేంద్రం చేతుల్లో “కూల్చివేత” ప్రక్రియ..!?

సచివాలయం కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఏదీ కలసి రావడం లేదు. కూల్చివేతకు పర్యావరణ అనుమతుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అనుమతులు అవసరమే లేదని వాదించింది. కూల్చివేత నిలిపివేయాలంటూ పిటిషన్ వేసిన...

HOT NEWS

[X] Close
[X] Close