అరవింద్ ప్లాన్ కు అఖిల్ బలి?

ఫ్లాపుల్లో వుండే హీరో అంటే ప్రతి ఒక్కరికి అలుసే.

అందుకే పాపం, ఫ్లాపుల్లో వున్న అక్కినేని అఖిల్ కు ఓ ఫ్లాప్ డైరక్టర్ ను అంటగట్టే ప్రయత్నం దిగ్విజయంగా జరుగుతోంది. వాసు వర్మ అనే డైరక్టర్ వున్నారు. ఆయన సంగతి టాలీవుడ్ కు తెలియంది కాదు. జోష్, కృష్ణాష్టమి లాంటి ఆణిముత్యాలు అందించిన డైరక్టర్. ఇప్పడు ఆ డైరక్టర్ తెచ్చిన కథ అల్లు అరవింద్ కు నచ్చింది. 

కానీ వాసు వర్మ ఢైరక్షన్ అంటే ఏ హీరో చేయడానికి ముందు వస్తారు? నిఖిల్ మొదలుకుని, టాప్ హీరో వరకు ఎవ్వరూ ఒకె అనరు. అందుకే అక్కినేని అఖిల్ ను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గీతా క్యాంప్ కాబట్టి, గట్టి సూపర్ విజన్ వుంటుంది. సినిమాను చివరిదాకా చెక్కుతూ వుంటారు. ఇలాంటి వ్యవహారాలన్నీ చూపించి, వాసువర్మతో అఖిల్ సినిమా చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా అఖిల్ మరీ కాదు అంటే గీతా క్యాంప్ లో మరో ఇద్దరు ప్లాపుల డైరక్టర్లు వున్నారు. బొమ్మరిల్లు భాస్కర్. శ్రీకాంత్ అడ్డాల.

మొత్తానికి అఖిల్ పని, ఫ్లాపు డైరక్టర్ల కు హీరోగా మారిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com