హ్యాపీ బర్త్ డే తారక్ అని జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు. ఆయన పుట్టినరోజు కాదుగా ఎందుకు చెప్పారని అనుకోవచ్చు. కానీ తారక్ అని ఆప్యాయంగా పిలిచింది జూనియర్ ఎన్టీఆర్‌ని కాదు.. కేటీఆర్‌ని. కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి తారక్ అనే పేరు నచ్చింది. అందుకే ఆ పేరుతో ఆప్యాయంగా పిలిచి జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చెప్పారు.
కేటీఆర్ ను ఎవరూ తారక్ అని పిలవరు. కేసీఆర్ ఎప్పుడైనా కేటీఆర్ గురించి చెప్పాల్సి వస్తే రాము అంటారు.. పార్టీ క్యాడర్ కూడా రామన్న అంటారు. పార్టీ నేతలంతా అదే పేరుతో పిలుస్తారు. కుటుంబసభ్యులంతా రాము అనే పిలుస్తారు. తారక్ అని పిలిచేవారు దాదాపుగా ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకం. ఆయనను తారక్ అనే పిలుస్తారు. గుర్తు పెట్టుకుంటారు.
జగన్ తనకు అన్న అని కేటీఆర్ చెబుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నప్పుడు ఘోరమైన విమర్శుల చేసినా… రాష్ట్ర విభజన తరవాత రాజకీయ అవసరాల కోసం దగ్గరయ్యారు. అన్నదమ్ములయ్యారు. ఆ ఆప్యాయత అలా కనిపిస్తోంది. ఇటీవల కేటీఆర్ నారా లోకేష్ ను తన తమ్ముడు అని సంబోధిస్తున్నారు. అంటే అంటే ఏపీలో కేటీఆర్ కు ఓ తమ్ముడు.. ఓ అన్న ఉన్నారని అనుకోవచ్చు.