సహ నిందితుడి కోసం జగన్‌ ఆరాటం..! చట్టం కూడా మార్చేశారు..!

జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులైన వారికి.. ప్రాధాన్యం ఇవ్వడంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అంతే పవర్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఓడిపోయినా జైలుకెళ్లొచ్చిన మోపిదేవి మంత్రయ్యారు. కేసులు ఎదుర్కొన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అవకాశం ఉన్న చోటల్లా.. చార్జిషీట్లలో ఉన్న పేర్లన్నీ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మిని కూడా తెలంగాణకు తీసుకు రావాలనుకున్నారు కానీ.. కేంద్రం అడ్డుపుల్లేసింది. లేకపోతే.. ఇప్పుడామె.. తెలంగాణ సీఎంవోలో స్మితాసభర్వాల్ ఎంత పవర్ ఫుల్లో.. ఏపీ సీఎంవోలో అంతే పరవర్ ఫుల్ రోల్‌లో ఉండి ఉండేది. ఇప్పుడు… మరో సహ నిందితుడు ఎన్.శ్రీనివాసన్‌కు జగన్ పదవి ఇచ్చారు.

ఎన్. శ్రీనివాసన్… ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..?

మీరు క్రికెట్ ప్రేమికులైతే.. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా… చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఆయన మీకు పరిచితుడే. బెట్టింగ్ స్కాంలో ఆయన పేరు కూడా మార్మోగిపోయింది.

మీరు వ్యాపార రంగంపై ఆసక్తితో ఉన్నా.. ఆయన ఎవరో తెలిసిపోతుంది.. ఆయన ఇండియా సిమెంట్స్ చైర్మన్. ఇంకా చాలా వ్యాపారాలున్నాయి. భారత కార్పొరేట్ ప్రముఖుల్లో ఒకరు.

అలా కాదు.. షోబిజ్, గాసిప్స్ మీద ఆసక్తి ఉన్న వారైనా.. శ్రీనివాసన్‌ను ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఎన్.శ్రీనివాసన్ కుమారుడు.. అశ్విన్ శ్రీనివాసన్… దేశంలో గే మ్యారేజ్ చేసుకున్న వారిలో ఒకరు. కుమారుడి విషయంలో శ్రీనివాసన్ చాలా చేశారు.

ఇవన్నీ కాదు… దేశంలో సంచలనం సృష్టించిన కేసుల గురించి ఆసక్తి ఉన్నవారైనా… ఆయన గురించి ఇట్టే తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ కంపెనీల్లో… పెట్టుబడి పెట్టి.. అందుకు ప్రతిఫలాన్ని భారీగానే పొందారు. కేసుల పాలయ్యారు. ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే రేంజ్‌లో ఉన్నారు.

ఇలాంటి శ్రీనివాసన్ ఇప్పుడు.. టీటీడీ బోర్డు మెంబర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పుడు మూడో సారి. అంటే… వైఎస్ హయాం నుంచి అనుబంధం కొనసాగుతోందన్నమాట.

వైఎస్ హయాంలోనే రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీనివాసన్..!

వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది పారిశ్రామిక వేత్తలు… క్విడ్ ప్రో కో తో.. జగన్ కు.. పెట్టుబడులు పెట్టారు. తర్వాత వారిలో చాలా మంది జైలుకెళ్లారు. కేసుల పాలయ్యారు. అలాంటి వారికి పదవులు కూడా.. అప్పట్లో వైఎస్ కట్టబెట్టారు. ఈ ఎన్ శ్రీనివాసన్.. రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ కూడా అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత అవకాశం దక్కలేదు. తర్వాత కేసులు.. జైలు… కోర్టులు… అలా జరిగిపోయాయి.

మూడో సారి బోర్డు మెంబర్ అవడానికి చట్టం ఎలా ఒప్పుకుంది…?

ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం.. ఎవరైనా.. రెండు సార్లు మాత్రమే.. ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా ఉండగలరు. కానీ శ్రీనివాసన్ ప్రత్యేకం కాబట్టి… ప్రత్యేకంగా ప్రభుత్వం మినహాయింపు ఆదేశాలు ఇచ్చి మరీ టీటీడీ బోర్డు మెంబర్ గా … నియమిస్తూ జీవో జారీ చేసింది. బుధవారం మేరకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం… దేవాదాయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.

సహనిందితుల కోసం జగన్ ఎంత సాయమైనా చేస్తారా..?

జగన్మోహన్ రెడ్డి తీరు విస్మయకరంగా ఉంది. ప్రజాసొమ్మును దోచుకుని జైలుకెళ్లి వచ్చిన.. నిందితులంతా.. ఇప్పుడు పాలకవర్గంగా మారిపోతున్నారన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. చివరకు నిబంధనలను సైతం సడలించి.. శ్రీనివాసన్‌ను.. శ్రీవారి చెంతకు చేర్చడం.. మరింత అనుమానామాస్పదంగా మారింది. ఇదో కొత్త తరహా క్విడ్ ప్రో కోగా మారిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే జగన్ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close