కొత్తపలుకు : ఇప్పుడు సరే .. తర్వాత ఓడిపోతే వైసీపీ నేతల పరిస్థితేమిటంటున్న ఆర్కే..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్ట్ వేమూరి రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో సింహభాగం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య పూర్వాపరాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ అంశంలో… మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా… ప్రభుత్వ వేధింపుల వల్లే…కోడెల ఆత్మహత్య అని ఆర్కే తేల్చారు. ” రాజకీయాల్లో హత్యలు చేయడం చూశాం కానీ, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం…” అని ఆర్కే ఆవేదన చెందారు.

కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణం..!

“కొత్తపలుకు”లో కోడెలను… గత మూడు నెలలుగా ఎలా వేధించారో.. ఆర్కే వివరంగా రాసుకొచ్చారు. కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులను నమోదు చేసిన ప్రభుత్వం ఫర్నీచర్ విషయాన్ని దొంగతనంగా మార్చడంతోనే ఆయన మానసికంగా వేదనకు గురయ్యారని ఆర్కే చెబుతున్నారు. అయితే.. ఇందులో కోడెల కుమారుడి తీరును.. ఆర్కే కూడా తప్పు పట్టారు. ఓ చిన్న కేసుకే.. కోడెల ఆత్మహత్య చేసుకుని ఉంటారా.. అని వస్తున్న సందేహాలకు కూడా.. ఆర్కే సమాధానం ఇచ్చారు. ఫర్నీచర్ కోసం కక్కుర్తి పడ్డారా.. అని తాను కూడా సందేహించేలా పరిస్థితులు వచ్చాయన్నారు. నైతిక మద్దతు ఇవ్వడానికి టీడీపీ నేతలు కూడా సిద్ధపడని విషయాన్ని గుర్తు చేశారు.

రేపు వైసీపీ అధికారం కోల్పోతే పరిస్థితి ఏమిటి..?

అధికారం శాశ్వతమని.. అధికారంలో ఉన్న వారికి అనిపించవచ్చేమో కానీ.. కాస్త తెలివి ఉన్న వారెవరికైనా.. అది అశాశ్వతతమని తెలుసు. రేపు కచ్చితంగా అధికారం పోతుంది. అప్పుడు.. ఇప్పుడు.. వేధింపులకు పాల్పడుతున్న నేతలు.. ఆ పార్టీలో ఉన్న వారి పరిస్థితేమిటన్నది … ఆర్కే..”కొత్తపలుకు”లో లేవనెత్తిన చర్చ. ఇప్పుడు దెబ్బలు తింటున్న నేతలు.. అప్పుడు.. సైలెంట్ గా ఎలా ఉంటారు..? ” తదుపరి ఎన్నికలలో ఓడిపోతే తమ గతి ఏమిటి? అని ఒక్క క్షణం ఆలోచించినా ఈ దుస్ధితి పోతుంది..” అని ఆర్కే చెప్పుకొచ్చారు.

వేధించడానికేనా ఈ ప్రభుత్వం..!

ఆర్కే… “కొత్తపలుకు”లో చాలా కీలకమైన అంశాలను లేవనెత్తారు. ఈ ప్రభుత్వం వేధించడానికి తప్ప.. ఇక ఏ పనీ చేయడం లేదని… తేల్చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి మరోసారి నోటీసులు జారీ చేయడాన్ని ఆర్కే ప్రస్తావించారు. ” కోడెల శివప్రసాదరావు మరణం మిగిల్చిన ప్రశ్నలు, గుణపాఠాలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగడం తగదని రాజకీయాల్లో ఉన్నవారు తెలుసుకోవాలని..” నేరుగా.. ఓ రకంగా.. హెచ్చరికల్లాంటివి పంపేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close