జగన్ రెడ్డి బెంగళూరును తన మెయిన్ ల్యాండ్‌గా మార్చుకుని ఇప్పుడు కర్ణాటక అల్మట్టి ఎత్తు పెంచుతోందని అక్కడ్నుంచే దీనికంతటికి చంద్రబాబే కారణం అని చాటభారతం ట్వీట్ పెట్టారు. అల్మట్టి ఎత్తు గురించి ఇటీవల బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోంది. అందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని.. వైసీపీకి కూడా డ్యూటీ అప్పచెప్పారేమో కానీ.. జగన్ కూడా రంగంలోకి దిగారు.
గతంలో అల్మట్టి ఎత్తు పెంచారని చాలా రాజకీయం చేశారు. ఇప్పుడు మళ్లీ అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమయిందని జగన్ అంటున్నారు. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచుతోందని చెప్పుకొచ్చారు. దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనుందని కూడా చెప్పుకొచ్చారు. కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుందని.. జగన్ చెబుతున్నారు.
జగన్ రెడ్డి కూడా తాను సీఎంగా ఉన్నప్పుడు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ తో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు కూడా ప్లాన్ చేశారు. ఎన్ని కట్టారో.. కర్ణాటక కూడా అలాగే కడుతుంది. కేసీఆర్‌తో కలిసి రాష్ట్ర నీటి ప్రయోజనాలను భంగం కలిగించడమే కాక నీటిపారుదల ప్రాజెక్టుల్ని..చివరికి పోలవరాన్ని కూడా నాశనం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తానని కేసీఆర్ కు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో చెబితే కనీసం మాట మాత్రంగా కూడా స్పందించలేదు. కానీ ఆలూ లేదు..చూలూ లేదు.. ఇదిగో అల్మట్టి ఎత్తు పెంచుతున్నారు..మీరేం చేస్తున్నారని అటు టీఆర్ఎస్.. ఇటు వైసీపీ రాజకీయం ప్రారంభించేసింది. పదవిలో ఉన్నప్పుడు పనితనం గడప దాటలేదు కానీ.. ప్యాలెస్‌లో కూర్చుకుని సలహాలు మాత్రం ట్వీట్లలో రూపంలో ఇచ్చేస్తూంటారు.