జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తనకు కాంగ్రెస్ ఏదో అన్యాయం చేసిందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఇవాళ అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ పార్టీదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన ఎదుగుదల వెనుక ఉన్న పునాదులను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం మొత్తం ఆ పార్టీతోనే ముడిపడి ఉంది. సాధారణ స్థితిలో ఉన్న కుటుంబాన్ని రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానమే. అయినా ఆ పార్టీ తననేదో మోసం చేసిందని ఇప్పటికీ నిందలేస్తూనే ఉంటారు.
కాంగ్రెస్ ఫలాలు తింటున్న జగన్
కుటుంబం దివాలా స్థితిలో ఉన్నప్పుడు ఆయన తండ్రిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకుంది జగన్. అందుకే తన టీవీ చానల్ కంపెనీకి ఇందిరా టెలివిజన్ అని పేరు పెట్టారు. వైఎస్ హఠాత్తుగా చనిపోయేదాకా ఆయన కాంగ్రెస్ పార్టీ రక్తమే. వైఎస్ పోయాక.. ఆయన పదవి తనకి ఇవ్వలేదని చెప్పి ఏకంగా సోనియా మీదనే నిందలేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి తనకే దక్కాలనే పట్టుదల జగన్ లో పెరిగింది. అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో పార్టీతో విభేదాలు మొదలయ్యాయి. అప్పటివరకు తన తండ్రిని గౌరవించిన నాయకత్వంపైనే ఆయన తిరుగుబాటు చేశారు. కేవలం అధికారం దక్కలేదనే కారణంతోనే సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి మరణం చుట్టూ రాజకీయ కుట్రలు అల్లి సానుభూతి పొందడానికి ప్రయత్నించడం ఆయన స్వభావాన్ని సూచిస్తుంది.
సోనియాపైనే దారుణమైన ఆరోపణలు చేసిన వ్యక్తిత్వం
ఎంత దారుణమైన మనస్థత్వం ఉంటే తన తండ్రిని.. సోనియా చంపించిందని నిందలేసి రాజకీయం చేస్తారు. సొత పార్టీ పెట్టుకున్నాక… కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా అనుభవిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు ఉన్న బలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ కు బలమన నేత లేక ఆ ఓటు బ్యాంక్ ఆయన వెనుక ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటికీ జగన్ బలం మొత్తం పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకే . వాళ అనుభవిస్తున్న రాజకీయ బలం కాంగ్రెస్ నిర్మించుకున్న పునాదుల నుండే వచ్చాయి. ఆ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలనే తనవిగా ప్రచారం చేసుకుంటూ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
కాంగ్రెస్కు..తండ్రికి సంబంధం లేదన్నట్లుగా ఇప్పుడు రాజకీయం
విచిత్రం ఏమిటంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే జగన్ నిరంతరం విమర్శలు గుప్పిస్తుంటారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని, వేధించిందని పదేపదే చెబుతుంటారు. కానీ వాస్తవానికి ఆ పార్టీ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. అధికారం కోసం సొంత పార్టీని వీడటమే కాకుండా అదే పార్టీ మూలాలను దెబ్బతీసేలా వ్యవహరించడం ఆయన రాజకీయ చతురతలో భాగమే అయినా అందులో కృతజ్ఞత లోపించింది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి లేకుండా చేయడంలో జగన్ సఫలమయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుని ఇవాళ తనదే అసలైన వారసత్వం అని చెప్పుకుంటున్నారు. తన ఎదుగుదలకు కారణమైన వారిపైనే విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం ఆయన వ్యక్తిత్వ శైలిని ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ నుండి విడిపోయినా ఆ పార్టీ ఓట్లతోనే రాజకీయం చేస్తూ మళ్ళీ అదే పార్టీని నిందించడం వైరుధ్యంగా కనిపిస్తుంది. అధికార దాహం ముందు కృతజ్ఞత అన్న పదానికి తావులేదని జగన్ తీరు నిరూపిస్తోంది.
