చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ అంటే.. నిరుపేదలకు, వివిధ కారణాలతో ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందని వారు, అలాంటి సాయం సరిపోని వారికి ముఖ్యమంత్రి చేసే సాయం. ఆ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తాయి. బడ్జెట్ పరంగా కేటాయిస్తారు కూడా. అయినా జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు సాయం చేసిందేమీ లేదు. ఎన్నో లక్షల మంది సాయం కోసం దరఖాస్తులు చేసుకున్నా.. వేల మందిని కూడా కనికరించలేదు.
జగన్ హాయాంలో ఏడాదికి రూ.170 కోట్లే
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019-2024 మధ్య 5 సంవత్సరాల పాలనలో సీఎంఆర్‌ఫ్ ద్వారా మొత్తం రూ. 800 కోట్ల సాయాన్ని ఇచ్చారు. అంటే ఏడాదికి 170 కోట్లు మాత్రమే. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క ఏడాదిలోనే నాలుగు వందల కోట్లకుపైగా పేద ప్రజలకు సాయం అందించారు. అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వైద్యం ఆలస్యం కాకుండా సాయం చేస్తున్నారు. ఆయా కుటుంబాల పరిస్థితి, ఆనారోగ్య తీవ్రత ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నారు. సీఎం సహాయ నిధి విషయంలో ఎక్కడా జాప్యం కాకుండా సీఎం కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి అధికారి ఉంటున్నారు.
జగన్ హయాంలో సీఎంఆర్ఎఫ్కు నిధుల వెల్లువ
చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కు.. జగన్ హయాంలో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. కరోనా కారణంగా కార్పొరేట్ సంస్థుల వందల కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఈ నిధుల్ని ఆయన ఆపన్నులకు అందించడంలో విఫలం అయ్యారని రికార్డులు చూపిస్తున్నాయి. ప్రజలు ఆ సమయంలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల మంది చనిపోయారు. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైద్య చికిత్సల కోసం అల్లాడిపోయారు. సగం మంది ప్రజలు చికిత్సల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.ఆ సమయంలో లక్షల దరఖాస్తులు సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చి ఉంటాయి. కానీ జగన్ పట్టించుకోలేదు. వారి కోసం వచ్చిన నిధుల్ని కూడా వెచ్చించలేదు.
ఫేక్ చెక్కులతో దోపిడీ చేయబోయి దొరికారు.. కానీ పట్టుకోలేదు !
జగన్ హయాంలో ఓ సారి కోల్ కతా బ్యాంకులో చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని జమ చేశారు. అది చిన్న మొత్తం కాదు.దాదాపుగా వంద కోట్ల రూపాయలు. విషయం బయటపడే సరికి గగ్గోలు రేగింది. సీఐడీ విచారణ జరిపింది. ఆ చెక్కులు బ్యాంకులో ఎవరు వేశారు.. ఎవరి బ్యాంకు అకౌంట్లో వేశారు అన్నవి ఆరా తీయడం ఒక్క రోజులో పని . కానీ ప్రభుత్వం అసలు నిందితుల్ని పట్టించుకోలేదు. అప్పటి ఓ వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరో చిన్న చిన్న బకరాల్ని అరెస్టు చేసి మమ అనిపించారు. అసలు నిందితులు మాత్రం దొరకలేదు. ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. వీరు దొరికారు కాబట్టి బయటపడింది. దొరకని వాళ్లు ఎన్ని కోట్లు సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి కొట్టేశారో వారికే తెలియాలి.
